ల్యాండ్ మార్క్ ను దాటేసిన శాతకర్ణి

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.  సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాల‌య్య కేరీర్‌లోనే తిరుగులేని హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన వారంద‌రూ తెలుగు జాతి గ‌ర్వించేలా ఉంద‌ని కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

ఈ కలెక్షన్లు బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లుగా నిలిచాయి. అన్ని ఏరియాల్లోను బాల‌య్య గ‌త సినిమాల రికార్డుల‌ను శాత‌క‌ర్ణి క్రాస్ చేసేసింది.

ఏరియా వైజ్‌గా శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :

నైజాం : 7.31

సీడెడ్ : 6.47

నెల్లూరు : 1.50

గుంటురు : 3.66

కృష్ణా : 2.57

వెస్ట్ గోదావరి : 3.06

ఈస్ట్ గోదావరి : 3.02

ఉత్తరాంధ్ర : 4.00

———————————

ఏపీ + తెలంగాణ 31.59 కోట్లు

———————————–

కర్ణాటక : 3.50

రెస్ట్ ఆఫ్ ఇండియా :  0.50

ఓవ‌ర్సీస్ : 5.10

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 1.00

—————————————

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ : 41.69

—————————————

ఈ మొత్తం 41.69 కోట్ల షేర్‌తో శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో టాప్ 10లో స్థానం సంపాదించి 9వ ప్లేస్ లో నిలిచింది.