వంగవీటి TJ రివ్యూ

సినిమా : వంగవీటి
రేటింగ్ : 2.75/5
పంచ్ లైన్ : కాపు కమ్మ కాదు వర్మ సినిమా
నటీనటులు : సందీప్, వంశి కృష్ణ, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్.
బ్యానర్ : రామదూత క్రియేషన్స్
రచయితలు : చైతన్యప్రసాద్, రాధాకృష్ణ
సాహిత్యం : సిరాశ్రీ, చైతన్యప్రసాద్
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి
ఎడిటర్ : సిద్ధార్థ్ తాతోలు
మ్యూజిక్ : రవిశంకర్
నిర్మాత : దాసరి కిరణ్కుమార్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

రక్త చరిత్ర టు వంగవీటి మధ్య కాలం లో సినిమాల్లో ఎన్నో మార్పులొచ్చాయి కానీ రాంగోపాల్ వర్మ మాత్రం మారలేదు.అప్పుడెలా ఉన్నాడో ఇప్పటికీ అలానే వున్నాడు.దీని ఉద్దేశం మనుషులు మారాలని కాదు కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఇలాగే నేను నా ఇజం అంటూ కాలం గడపాల్సి వస్తుంది.అయినా ఇదంతా ప్రస్తుతం అప్రస్తుతం అయినా కానీ వర్మ గారు అనే టాపిక్ వస్తే ఉండబట్టలేక ఓ రెండుముక్కలు ఎక్కువ రాయాలనిపిస్తుంది ఎవరికైనా.అంత ఇంపాక్టింగ్ మనిషి వర్మ.

ఇక సినిమా విషయానికి వస్తే యథార్థ కథ అని అందరికి తెలిసిన విషయమే అయినా దాన్ని వర్మ ఎలా చూపించాడా.. ఎవరిని ఎక్కువ చేసాడు.. ఎవర్ని తక్కువ చేసాడో అన్న కుతూహలమే మొదటి రోజు దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబట్టగలిగింది వంగవీటి సినిమా.రక్షత చరిత్ర బెజవాడ బ్యాక్ డ్రాప్ లో ఎలా ఉంటుందో అలాగే ఉందీ వంగవీటి సినిమా సింపుల్ గా చెప్పాలంటే.అంత కంటే ఓ నాలుగు పెద్ద మడ్డర్లు.. నలభై నాలుగు చిన్న మడ్డర్లు ,నాలుగు వందల నలభై నాలుగు కత్తిపోట్లు సినిమా అంతా కలిపితే ఇంతే.

ఈ సినిమా కథ తెలియందెవరికి…అయినా వర్మ ఏ కథ చెప్పాడా అన్నదే ఆసక్తి రేకెత్తించింది.వెంకట రత్నం హత్య తో మొదలైన బెజవాడ రౌడీయిజం దానిపై వంగవీటి రాధ గుత్తాధిపత్యం..రాధాకి గాంధీ,నెహ్రూల జత కలవడం …రాధా హత్య..రంగా ఆరంగ్రేటం ..రంగా పెళ్లి..గాంధీ నెహ్రు రంగా తో విడిపోవడం..గాంధీ హత్య..తరువాత నెహ్రు చిన్న తమ్ముడు మురళి హత్య..చివరగా వంగవీటి రంగా హత్య ..ఇది వంగవీటి కతాంశం.

అదే వర్మ వాయిస్ ఓవర్..యదావిధిగా కెమెరాలు కిందా మీదా సందుల్లో…బహుశా క్రియేటివిటీ ఏమో..ఇవి కాక వర్మ గారు పాటల్లో కూడా తన ప్రావీణ్యం ప్రదర్శించి చెయ్యాల్సిన రచ్చంతా చేశారు పాపం.ఇవి పక్కన పెడితే సినిమా ఎనభైల్లో బెజవాడ నేటివిటీ ఎలా ఉండేదో అచ్చం అలాగే చూపించడానికి వర్మ పడ్డ కష్టం తెలుస్తుంది.చిన్న చిన్న విషయాల్లో నేటివిటీ చూపించడం లో వర్మ క్రియేటివిటీ కనపడుతుంది.

అన్నిటికంటే మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో ఎవర్ని ఎక్కువా చూపలేదు ఎవర్ని తక్కువా చూపలేదు.మరీ ముక్యంగా కులం అన్న అంశాన్ని ఎక్కడా తాకకపోవడం మెచ్చుకోవాలి.ఒకే ఒక సారి సినిమా మొత్తానికి క్యాస్ట్ అని వాడడం మెచ్చుకోవాలి.వర్మ సినిమా ముందు వివాదాలుంటాయేమో కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఎటువంటి వివాదం ఉండదు.ఇది నిజంగా వర్మ గొప్పతనమే.సినిమా మొదలుపెట్టాక వివాదమంటారా అది వర్మ జనమ హక్కు అది లేకుండా సినిమా మొదలవ్వదు.

ఇక సినిమాకి రాధా,రంగా అయిన సందీప్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు..కళ్ళల్లో ఆ కసి..కోపం ఉక్రోషం..అన్ని సందీప్ సింప్ల్య్ సూపర్బ్.మిగిలిన వాళ్లంతా రక్త చరిత్రో సైడ్ కేరక్టర్స్ ఎలా వుంటాయో అలాగే ఉంటాయి.అందరూ చాలా నాచురల్ గా సెట్ అయ్యారు.హీరోయిన్ నైనా గంగూలీ వర్మ సినిమాల్లో హీరోయిన్ లా కాకుండా పద్దతిగా కనిపించింది.స్వర్గీయ నందమూరి తారక రామా రావు గారిని ఎలా చూపించాడా అన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది..ఎంత వరకు చూపించాలో ఎలా వివాదం లేకుండా ముగించాలో అలాగే వర్మ పర్ఫెక్ట్ గా హేండిల్ చేసాడు.

టెక్నికల్ గా మాట్లాడుకుంటే తెలిసిన కథే కాబట్టి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అయింది వంగవీటి.స్క్రీన్ప్లే కూడా అక్కడక్కడా ఇంకా గ్రిప్పింగా వుండాల్సింది.పాటలు బాక్గ్రౌండ్ స్కోర్ అంతా రక్త చరిత్రనే గుర్తుకు తెస్తుంది.మాటలు అక్కడక్కడా పేలాయి.ఆవిడంటే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టునది కాబట్టి పగ కోరుకుంటోంది ,నాకు మీరు కావలి కాబట్టి నేనేందుకు ఆవిడలా ఆలోచిస్తాను లాంటివి.ఇక ఫైనల్ పంచ్ బాగుంది.రంగా ని ఎవరు చంపారన్నది ఇప్పటికీ మిస్టరీనే..ఇదంతా తెలిసిన ఒకే ఒక వ్యక్తి బెజవాడ దుర్గమ్మ.అమ్మలగన్న అమ్మ అన్ని తెలిసినా నోరు మెదపకుండా మౌనంగా చూస్తూనే ఉంటుందంటూ ఛలోక్తిన్చడం కొసమెరుపు.

ఓవర్ అల్ గా ఇప్పటికే వర్మ నుండి ఇలాంటి సినిమాలు చూసేసి ఉండడం తో కొత్తదనం కనిపించదు.సినిమాకు అతి పెద్ద బోనస్ క్యూరియాసిటీ… నేపథ్యం.వర్మ పార్ట్ వరకు సినిమా అంతా బాగానే హేండిల్ చేసినా దానికి తగ్గ సాంకేతిక బృందం కూడా తోడయితే వర్మ సినిమాల రేంజ్ ఇంకోలా ఉంటుంది మరి.ఈ వింషయం వర్మ గారికి ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో.