వదిన మరిది ల షాపింగ్ మాల్

నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు.

ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో వున్నాను అంటూ కొంత కాలం హింట్ ఇచ్చింది..ట్విట్టర్ వేదికగా అభిమానుల ప్రశ్నస్త్రాలకి సరదాగా స్పందించి హాట్ టాపిక్ అయ్యింది.ఇక తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి వివాహ వేడుకలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి శుభం కార్డు పడినట్టుగా అక్కినేని ఫామిలీ మొత్తం సమంత తో సహా పెళ్ళిలో హడావుడి చేసింది.

ఇంకో పక్క చైతు తమ్ముడు అఖిల్ కూడా శ్రీయ భూపాల్ అనే ఫాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసందే..వారి ప్రేమ కూడా పెళ్లిదాకా వచ్చేసినట్టు సమాచారం.రెండో సినిమా మొదలు పెట్టె సన్నాహకాల్లో బిజి గా ఉన్న అఖిల్ వదిన సమంత తో కలిసి ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో సందడి చేశారు.మరిది తో కలిసి సమంత సామాజి గూడలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాబోయే వదిన మరిదిలను చూడ్డానికి అభిమానులు పెద్దసంఖ్యలో ఎగబడ్డారు.కెమెరాలు,సెల్ ఫోన్ లో గ్యాప్ లేకుండా ఫోటోలను క్లిక్ మనిపించారు.