శాతకర్ణి సినిమాపై గుణశేఖర్ మెలిక

బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12 న విడులబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు మొదటగా తెలంగాణా ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వగా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయించి తమ ఉదారతను చాటుకుంది.

ఇంత వరకు బాగానే వున్నా..ఓ కార్పొరేట్ స్థాయి నిర్మాణ సంస్థ సారథ్యం లో అగ్ర దర్శకుల్లో ఒకడైన క్రిష్ దర్శకత్వం వహించిన,బాలకృష వంటి టాప్ హీరో నటించిన సినిమాకు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీ పడి మరీ పన్ను మినహాయించారు.మరి గుణశేఖర్ తన యావదాస్థుల్ని తాకట్టు పెట్టి మరీ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చారిత్రాత్మ భారత దేశం లోనే మొట్ట మొదటి  స్టీరియోస్కోపిక్ 3D సినిమా అందునా మహిళా సాధికారతకు మారుపేరైన రుద్రమదేవి సంగతేంటి.

తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఈ సినిమాకి పన్ను మినహాయింపునిచ్చింది.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కొన్నాళ్ళు నానబెట్టి విషయాన్ని పక్కన పడేసింది.సరిగ్గా ఇప్పుడే గుణశేఖర్ కి ఆయుధం దొరికిందనుకున్నాడో ఏమో వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇదే విషయమై ఉత్తరం రాసాడు.అప్పట్లో రుద్రమ దేవి సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన వినోదపు పన్ను తిరిగి ఇవ్వాల్సిందిగా గుణశేఖర్ లేఖాస్త్రం సంధించాడు.