శృతి హాసన్ బిస్కెట్లు

శృతి హాసన్ నేటివ్‌గా సౌత్ హీరోయిన్ అయినా.. ఇప్పుడు ఇండియా మొత్తంలో క్రేజ్ సంపాదించేసింది. అటు పెర్ఫామెన్స్ తో పాటు ఇటు గ్లామర్ డోస్ లోనూ శృతికి ట్యాలెంట్ చాలా ఎక్కువ. అందుకే శృతి స్పీడ్‌ని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సౌత్ బ్యూటీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడో బిస్కెట్ల కంపెనీకి కూడా సైన్ చేసింది.

యూనిబిక్ అనే బిస్కెట్ల కంపెనీ ఈ హాట్ బ్యూటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే తీసిన కమర్షియల్స్ అటు వెబ్ లోను.. ఇటు టీవీలో హల్ చల్ చేస్తున్నాయి.ప్రస్తుతం శృతి హాసన్ యూత్ ఐకాన్ అని.. ఈ బబ్లీ బేబీకి.. తమ బిస్కెట్లకు దగ్గర పోలికలు ఉండడంతోనే ఆమెను ఎంపికచేసుకున్నామని అంటున్నాయి కంపెనీ వర్గాలు. మొత్తానికి శృతి హాసన్ మాత్రం ఇంటర్నేషనల్ బ్రాండ్లను బాగానే ఒడిసి పట్టుకుటోంది. సినిమాల విషయంలో చూపించిన ట్యాలెంట్ యాడ్  విషయంలోనూ అప్లై చేస్తోంది శృతి.