శ్రీదేవి అవార్డు అందుకే అందుకోలేదా?

స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎందరో తారలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది.

ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక మీద సోనాక్షి సిన్హా శ్రీదేవిని అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె నటనాప్రతిభకు జోహార్లు అర్పించింది. ప్రేక్షకులంతా పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. కానీ అదంతా చూడడానికి శ్రీదేవి అక్కడ లేదు. ఎందుకనీ… అని ఆరా తీస్తే.. ఇంత పెద్ద పురస్కారం అందుకునే వయసు తనకు ఇంకా రాలేదని శ్రీదేవి భావిస్తోందట. అందుకే కార్యక్రమానికి రాలేదని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. శ్రీదేవి రాకపోతే పోయింది కానీ శ్రీదేవి గురించి సోనాక్షి ఇచ్చిన ప్రెజెంటేషన్‌ మాత్రం అదిరిందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు.