సాహసం శ్వాసగా సాగిపో TJ రివ్యూ

సినిమా : సాహసం శ్వాసగా సాగిపో
రేటింగ్ : 2.75 / 5
పంచ్ లైన్ : యాక్షన్ బేస్డ్ ఏం మాయ చేసావే

నటీనటులు : నాగ చైతన్య,మంజిమ మోహన్,సతీష్ కృష్ణన్,బాబా సెహగల్ తదితరులు.
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
ఎడిటింగ్ : ఆంథోనీ
నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : గౌతమ్ మీనన్

మనకు తెలిసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ అంటే అయితే కంప్లీట్ నావెలిస్టిక్ లవ్ స్టోరీ తీయడం లేదంటే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ గ్యాంగ్స్టర్స్ మధ్యన స్టైలిష్ యాక్షన్ సినిమా తీయడం. అలాంటివే ఇది వరకు మనం చుసిన ఏం మాయ చేసావే,ఘర్షణ లాంటి సినిమాలు.ఒక దర్శకుడు ఒక స్టైల్ అఫ్ మేకింగ్ బాగుంది అన్నారు కదా అని తనలో ఉన్న క్రియేటర్ ని పక్కన పెట్టేసి అవే సినిమాలు పదే పదే చేస్తే ఎంత స్టైల్ అఫ్ మేకింగ్ వున్నా ప్రేక్షకులకి బొర్ కొట్టేస్తాయి.అదే జరుగుతోంది గౌతమ్ మీనన్ విషయం లో.ఈ విషయంలో గౌతమ్ మీనన్ కంటే ముందు పూరీజగన్నాధ్ ది ఫస్ట్ ప్లేస్ అనుకోండి అది వేరే విషయం.

ఏం మాయ చేసావే వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో చైతు కెరీర్ కి మంచి ఊపునిచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్.అలాంటి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే అందరిలోనూ మంచి ఆసక్తి నెలకొంది.తన రెండు జోనర్ సినిమాలు ప్రేక్షకులకి బొర్ కొట్టేశాయనుకున్నాడో ఏమో గౌతమ్ మీనన్ ఈ సారి కాస్త ట్రెండ్ మార్చాడు.మార్చడమంటే ఇంకేదో కొత్త పంథాలో తీసాడనుకుంటే పొరపాటే.తనకు తెలిసిన రెండు జోనర్స్ ని కలిపేసి వండి వార్చేసాడు.సింపుల్ గా చెప్పాలంటే ఏం మాయ చేసావే సినిమాకి ఘర్షణ బ్యాక్ డ్రాప్ ఇవ్వడం అన్నమాట.

కేరళ బ్యాక్ గ్రౌండ్ క్రిస్టియన్ అమ్మాయి అయితే మళ్ళీ ఏమాయ చేసావే రెండో సారి చూసినట్టుంటుందని మరాఠి బ్యాక్ గ్రౌండ్ తో, అమ్మయి పై ఇంట్లో కాకుండా హీరో ఇంట్లోనే ఉంటూ సీన్ మధ్యలో పాటలు బిట్స్ బిట్స్ గా వస్తూ పోతూ ఉండడం ఇది వరకే చూసేసిన సినిమానే మళ్ళీ చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది.అయితే అదే థీమ్ మల్లి రిపీట్ అయినా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చెయ్యడం లో గౌతమ్ మీనన్ సక్సెస్ అయ్యాడు.ప్రేక్షకులకంటే ముందే తానే చాలా చోట్ల ఏమాయ చేసావే సీన్స్ తో ఈ సినిమాలో హీరో హీరోయిన్ సీన్స్ పోల్చడం బాగుంది.

ఇంజనీరింగ్ పూర్తి చేసి తన బైక్ నే తన ఫస్ట్ లవ్ గా ఫీలయ్యే ఓ కుర్రాడి జీవితం లోకి తన చెల్లి స్నేహితురాలు రావడం..తరువాత సౌత్ ఇండియా ట్రిప్ కి హీరో బయల్దేరడం దానికి హీరోయిన్ కూడా తోడవడం ఆ జర్నీ లో ఎదురయిన సంఘటనలేంటి దాని తరువాత వీరిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే కతాంశం.కథ పరంగా రెండు షేడ్స్ వున్నా షేడ్స్ వున్నాయి..మొదటి పార్ట్ అంతా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ తో గౌతమ్ మీనన్ మార్క్ లవ్ స్టోరీ బాగానే అలరిస్తుంది.ఇక రెండో పార్ట్ కొంచెం సస్పెన్స్,ఇంకొంచెం యాక్షన్ కలగలిపి సెకండ్ హాఫ్ కి సరిపడా కంటెంట్ అయితే కథలో వున్నా ఆ సస్పెన్స్ ని ఎలా ఎలివేట్ చెయ్యాలో ఎలా రివీల్ చెయ్యాలో తెలియని గందరగోళం మధ్య సినిమాని ముగించేయడం అతి పెద్ద లోటు.

లవర్ బాయ్ క్యారెక్టర్ లో తనకు తానే సాటి అని నాగచైతన్య మరో సారి చూపించాడు.ఈ మధ్యనే ప్రేమమ్,ఇప్పుడు ఈ సినిమాతో స్క్రీన్ ప్రెజన్స్ లో చైతు రోజు రోజుకీ ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు.ఇక మలయాళీ భామ మంజిమ మోహన్ నటనతో మంచి మార్కులు కొట్టేసింది.చాల నాచురల్ గా ఆక్ట్ చేసింది ఈ మల్లు బ్యూటీ.హీరోయిన్ అంజలి నా అనే అనుమానం కలుగుతుంది కొన్ని కొన్ని యాంగిల్స్ లో మంజిమాను చూస్తే.మిగిలిన వాళ్లలో నెగెటివ్ పాత్రలో బాబా సెహగల్ ఫుల్ లెంగ్త్ పాత్రలో సప్రైజ్ చేస్తాడు.ఏ ఆర్ రెహ్మాన్  పాటలు ఏం మాయ చేసావే సినిమాను గుర్తు తెస్తాయి.సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.డైలాగ్స్ నాచురల్ గా వున్నాయి.ఎంత నాచురల్ గా అంటే నా లవ్ గురించి ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరికి తెలిసిపోయింది అని చైతు అనేంతగా.

ఓవరాల్ గా రెండు గౌతమ్ మీనన్ సినిమాలు ఒకే సారి చూసినట్టు వుంటుందీ సాహసం శ్వాసగా సాగిపో.లవ్ స్టోరీ ని బాగా డీల్ చేసినా సెకండ్ హాఫ్ క్రైమ్ అండ్ ఆక్షన్ ఎపిసోడ్ సరిగా హేండిల్ చేసుంటే సినిమా వేరే హైట్స్ కి వెళ్ళుండేది.ఎంత సినిమాని కాపాడినా అది చైతు అండ్ లవ్ స్టోరీ నే.