సిఎం కుమారుడి మృతి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య (39) అనారోగ్యంతో మరణించారు. బెల్జియంలోని అంట్వెర్ప్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు అయన చికిత్స కోసం చేరారు. గతంలో రాకేష్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఇటీవలే రాకేష్ తన రాజకీయ ఎంట్రీ మీద వ్యాఖ్యలు చేసారు. తన తండ్రీ రాజకీయాల్లో వున్నంతకాలం తాను రానని అన్నాడు. తండ్రీకొడుకులన్న విమర్శలు రాకుండా వుండాలన్నదే తన ఉద్దేశ్యమని అన్నాడు. తండ్రీ రాజకీయాల్లో వుంటే తాను మాత్రం బయటనుంచి రైతులు, దళితలకోసం పోరాడాతనని అన్నారు. సిద్ధరామయ్య కుటుంబసబ్యులు కూడా ప్రస్తుతం బెల్జియంలో ఉన్నారు.

ఇటీవల విహారయాత్ర కోసం బెల్జియంకు వెళ్లిన రాకేష్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అక్కడ ఆస్పత్రిలో చేరారు. ఆయన ప్యాంక్రియాసిస్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య.. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి బెల్జియంలో ఉన్న తన కుమారుడికి ఉత్తమవైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సుష్మా స్వరాజ్ స్పందించి.. రాకేష్కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను ఆదేశించారు. సిద్ధరామయ్య తమ ఫ్యామిలీ డాక్టర్స్ ఇద్దరిని బెల్జియం పంపడంతో పాటు గురువారం ఆయన కూడా బెల్జియం వెళ్లారు.
రాకేష్ మరణవార్తలు విన్న ప్రధాని నరేంద్ర మోదీ బెల్జీయంలోని భారత దౌత్యవేత్తలతో మాట్లాడారు. రాకేష్ మృతదేహాన్ని భారత్ కు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు