సెన్సేషన్ సృష్టిస్తున్న రుస్తుం ట్రైలర్

అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రుస్తుం’ ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. రియల్‌ స్టోరీని బేస్‌ చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌లో అక్షయ్‌ లుక్ అభిమానులనే కాక బాలీవుడ్‌ జనాలనూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథానాయకుడి పాత్రకు అక్షయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడంటూ పొగిడేస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

ఇక, ట్రైలర్‌ విషయానికొస్తే..నేవీ ఆఫీసర్‌ రుస్తుం పావ్రిగా అక్షయ్‌ కుమార్‌ నీట్‌ లుక్‌తో కట్టిపడేస్తున్నారు. ఆయన నటన-హావభావాలు-డైలాగ్‌ డెలివరీ ఆసక్తికరంగా ఉన్నాయి. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఇలియానా. ఈషా గుప్తా, ఆర్జన్ బజ్వా ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌ 12న సినిమా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.