సెల్ఫీ రాజా TJ రివ్యూ

రేటింగ్: 2/5

పంచ్ లైన్ :సెల్ఫ్ లేని రాజా,ఇదో జబర్దస్త్ కామెడీ స్కిట్

Cast: Allari Naresh, Sakshi Chowdhary, Kamna Ranawat, Ballireddy Prudhviraj, Thagubothu Ramesh, Ravibabu
Director: G Eshwar Reddy
Producer: Anil Sunkara
Production House: AK Entertainments Pvt Ltd, Gopi Arts,
Music: Sai Kartheek
Editing: MR Varma
Art Direction: Chinna
Screenplay: Sreedhar Seepana
Dialogue: Diamond Ratnababu
Story/Writer: Sreedhar Seepana

ఈ మధ్య విజయం కోసం వెంపర్లాడుతున్న అల్లరినరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా సెల్ఫీ రాజా.అప్పుడెప్పుడో సుడిగాడు సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న నరేష్ ఆ తరువాత వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు.ఎంతో ప్లాన్ చేసి పకడ్బందీగా సినిమా చేసి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో సెల్ఫీ రాజా తీసాడు.ఈ సినిమా ప్రొమోషన్ కోసం నరేష్ పడ్డ కష్టం పాపం సినిమాకి కూడా పడుండడేమో. అంతగా భుజాలకెత్తుకొని మరీ ప్రోమోట్ చేశాడీ సినిమాని.రాష్ట్రం మొత్తం తిరిగేసాడు.పాపం నరేష్ ఒక్కడే కష్టపడితే సినిమా ఆడుతుందా!

ఈ సినిమాకి ఓ కథ కథనం అంటూ లేకపోవడమే అతి పెద్ద మైనస్ పాయింట్.ఏదో ఓ హీరోకి సెల్ఫీ పిచ్చి, అది అతనికి కామెడీ కష్టాల్ని తెచ్చిపెతుంది అనే ఓ లైన్ మీద సినిమా స్టోరీ అల్లెస్తే ఇదో ఈ సెల్ఫీ రాజా లాగా అస్త వ్యస్తంగా తయారవుతుంది.ఎంత కామెడీ సినిమా అయినా మెయిన్ ట్రాక్ అంటూ ఒకటుండాలి. అది లేక పోతే సినిమా మొత్తం నవ్వులపాలవుతుంది.ఈ మధ్య నరేష్ చేస్తున్నదదే.కథతో పాటు కామెడీ ట్రావెల్ చేస్తే సగటు ప్రేక్షకుడు సినిమాలో ఇన్వోల్వ్ అవుతాడు తప్ప కామెడీ కోసం కథని తిప్పితే ఈ సెల్ఫీ రాజా లాగే ఉంటుంది.

సెల్ఫీలతో కష్టాలు కొనితెచ్చుకునే హీరో తొలిచూపులోనే కమిషనర్ కూతురితో ప్రేమలో పడతాడు.కొద్దీ సేపటికే వారి ప్రేమ పెళ్లి,మధ్యలో విడిపోవడం అన్ని అయిపోతాయి.ఇంతలో ఇంటర్వల్ ట్విస్ట్ అన్నట్టు హెలోబ్రదర్ లా ఇంకో నరేష్ పుట్టుకొస్తారు.ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా ఉన్నా ఇద్దరు నరేష్ లు తెర పైన కనపడ్డ దగ్గరినుండి సినిమా మొత్తం గందర గోళం,ఎవరికి వారే యమునా తేరే.

అక్కడక్కడా కొన్ని పంచులు పర్వాలేదనిపించాయి. .భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియంది అదే భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని వాడు,ఇద్దరు కలిస్తేనే జీవితం అనేది ఒకటి.మొగుడు వదిలేసిన వైఫ్ పాస్ వర్డ్ లేని వైఫై రెండు ఒకటే,వీడు తినడానికి పులిహోర లేదు కానీ పక్కోడికి బిర్యాని పెడతాడంట ఇలా కొన్ని అక్కడక్క పర్వాలేదనిపించాయి.సినిమా మొత్తం జబర్దస్త్ కమెడియన్స్ తో నింపేశారు. ఇది సినేమానా లేక జబర్దస్ షో నా అనేంత మంది జబర్దస్త్ వాళ్ళున్నారు.ఉండొచ్చు కానీ ఎవ్వరి వల్ల పెద్దగా కామెడీ పండలేదు.అంతా ఏదో అలా వస్తూ పోతూ వుంటారు.కొన్ని సందర్భాల్లో అయితే అల్లరినరేష్ ఎక్కడా అని వెతుక్కోవాలి మనం.ఎంతసేపయినా ఈ జబర్దస్ కమెడియన్స్ కనిపిస్తారు తప్ప హీరో లేకుండానే సినిమా చాలా భాగం నడిచిపోతుంది.క్లయిమాక్స్ ఓమాదిరిగా వుండి అది కొంత కామెడీ తెప్పించింది.

సినిమాకి నరేష్ తన వంతు న్యాయం చేసాడు.కాకపోతే ఇంతకుముందు నరేష్ లో హిట్ కొట్టాలన్న భయం ఉండేది కాదు కాబట్టి కామెడీ టైమింగ్, ఆ ఈజ్ ఇంకా బావుండేది.ఈ సినిమాలో నరేష్ లో ఆ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది.మిగతా నటీనటుల్లో ముక్యంగా చెప్పుకోవాల్సింది పృద్వి గురించి.ఈ మధ్య ఏ సినిమా చూసినా చెలరేగిపోతున్న పృద్వినే ఈ సినిమాకి వున్న పెద్ద ప్లస్.నెల్లూరు గిరి,తాగుబోతు రమేష్ పర్వాలేదనిపించారు.ముక్యంగా తాగుబోతు రమేష్ కట్టప్ప గా నరేష్ బాహుబలిగా చేసిన సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి.హీరోయిన్స్ కి పెద్ద పనిలేదు ఈ సినిమాలో.ఆప్పుడప్పుడు అలా పాటల్లో కనిపిస్తే చాలు అన్నట్టు వున్నాయి వాళ్ళ పాత్రలు.నాగినీడు ఉన్నా క్యారక్టర్ కి అంత సీన్ లేదు. రవిబాబుకి సెకండ్ హాఫ్ లో హీరో తో సమానంగా వుండే క్యారక్టర్ ఇచ్చారు కానీ అది సరిగ్గా పండలేదు. లేదు.కృష్ణభగవాన్ ఒకే. మిగతా జబర్దస్త్ కమెడియన్స్ అంతా పెద్ద ఎఫక్ట్ చూపలేక పోయారు.

టోటల్ గా నరేష్ పంథా మార్చుకోక పోతే పదే పదే ఇలాంటి ఫలితాలే వస్తాయి.టాప్ హీరోలు కూడా కామెడీ నే నమ్ముకున్న రోజులివి.అలాంటిది ప్రత్యేకంగా నరేష్ చేసే కామెడీ సినిమాలకి ప్రేక్షకులు రావాలంటే ఇంకేదయినా కొత్తదనం కోరుకుంటారు.అదే మిస్ అవుతోంది నరేష్ సినిమాల్లో.