సోనాక్షి రూటే సెపరేటు

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది సోనాక్షి సిన్హా. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అకీరా’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో సోనాక్షి లేడీ సూపర్‌ స్టార్‌గా తనలోని యాక్షన్‌ టాలెంట్‌ని ప్రేక్షకులకి పరిచయం చేయనుంది.

బాలీవుడ్‌లో ఈ భామ రూటే సెపరేటు. ఎందుకంటే తన తోటి హీరోయిన్లు తన కన్నా ముందంజలో ఉన్నప్పటికీ వారి మీద ఏ మాత్రం అసూయ పడదంట సోనాక్షి. ఎవరి లక్‌ వారిది. తాను చేసే సినిమాల స్టోరీల పట్ల తాను చాలా సంతృప్తిగా ఉన్నానంటోంది. అంతేకానీ, తోటి హీరోయిన్స్‌ చేసే పాత్రల్లో ఎప్పుడూ తనకు అయ్యో అలాంటి ఫలానా పాత్ర నాకు వచ్చుంటే బావుండేది అని అనుకోలేదంట. ఆ ఆలోచనే తనను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టాయంటోంది. హాలీవుడ్‌ నుండి ఛాన్స్‌ వస్తే ఆలోచిస్తానంటోంది. ఎందుకంటే ఎప్పుడైనా తన మొదటి ప్రిపరెన్స్‌ బాలీవుడ్‌కే అంటోంది ఈ ముద్దుగుమ్మ సోనాక్షి.

అంతేకాదు తెలుగు సినిమాలన్నా తనకి అభిమానమే. అయితే అక్కడ నటించాలనే ఆలోచన, కోరిక అయితే తనకి లేవంటోంది. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మరిన్ని మంచి సినిమాలను తన నుండి ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయెచ్చునంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు పెద్ద సినిమాలున్నాయి. సల్మాన్‌ ఖాన్‌తో చేసిన ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌-2’ సినిమాలు విజయం కావడంతో ‘దబాంగ్‌’ మూడో సీక్వెల్‌లోనూ ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్‌గా ఎంచుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.