స్టార్ హీరోతో కిక్ -3 రెడీ…!

సురేంద‌ర్‌రెడ్డి అన‌గానే మ‌న‌కు కిక్‌, రేసుగుర్రం సినిమాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతాయి. ఈ రెండు సినిమాల‌ను సురేంద‌ర్‌రెడ్డి ప్ర‌జెంట్ చేసిన తీరు ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. కిక్ సినిమా విష‌యానికి వ‌స్తే క‌థ‌, క‌థ‌నాలు, ఊహించ‌ని ట్విస్టులు, హీరో-విల‌న్ మ‌ధ్య సాగే మైండ్‌గేమ్ ఆ సినిమాను ఓ రేంజ్‌లో నిలిపింది. అందుకే ఈ సినిమాకు సురేంద‌ర్ సీక్వెల్ కూడా తీశాడు. అయితే కిక్ స్టోరీతో సంబంధం లేకుండా రావ‌డంతో కిక్‌-2 డిజాస్ట‌ర్ అయ్యింది.

కిక్ సీక్వెల్ ప్లాప్ త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో ధృవ లాంటి రీమేక్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో సురేంద‌ర్ టేకింగ్ చూశాక మెగాస్టార్ చిరంజీవి సూరితో స్వ‌యంగా ఓ సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సురేంద‌ర్‌రెడ్డి చెప్పిన ఓ లైన్ చిరుకు బాగా న‌చ్చింద‌ట‌. చిరు ఈ క‌థ‌తో సినిమా చేసేందుకు చాలా ఇంట్ర‌స్ట్‌తో ఉన్నాడ‌ని స‌మాచారం. అయితే ఖైదీ నెంబ‌ర్ 150తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిరు త‌న 151వ సినిమా కోసం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను తీసుకోవాలా ?  లేదా ?  సురేంద‌ర్ క‌థ‌తో చేయాలా ? అని డైల‌మాలో ఉన్నాడ‌ని టాక్‌.

ఇక సురేంద‌ర్‌రెడ్డి చిరుకు చెప్పిన కథ స్టైలీష్ రివేంజ్ డ్రామాగా ఉండ‌నుంద‌ని టాక్‌. ఈ సినిమాలో మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు మెసేజ్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. టోట‌ల్‌గా కిక్ ఫార్మాట్‌లోనే ఈ స్టోరీ ఉండ‌నుంద‌ట‌. ఈ సినిమాకు కిక్‌-3 టైటిల్ కూడా సూరి ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. ఇక ఈ సినిమాకు కూడా కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణే నిర్మించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.