హీరో సుమంత్ సెన్సేషనల్ కామెంట్స్.

సుమంత్‌ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీర్య దానం చేసే వ్యక్తిగా ఈ సినిమాలో సుమంత్‌ నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. క్రేజీ టైటిల్‌తో, అరుదైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ట్రైలర్‌ని అక్కినేని నాగార్జున లాంఛ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ తనకి బాగా నచ్చేసింది అంటున్నారు నాగార్జున. నిజానికి ఇది రిస్కీ సబ్బెక్ట్‌ అయినప్పటికీ, సుమంత్‌ని ఈ సినిమా చేయమని ప్రోత్సహించింది నాగార్జునే అట. ఈ సినిమా బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కొంత ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ, ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా సబ్జెక్ట్‌.

ట్రైలర్‌ని వీక్షించడానికే జనం ఎంతో ఆశక్తిని కనబరుస్తున్నారు. ఇక సినిమా విడుదలయితే సెన్సేషన్‌ హిట్‌ అందుకోవడం పక్కా అంటున్నారు ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. పల్లవీ సుభాష్‌ ఈ సినిమాలో సుమంత్‌కి జోడీగా నటించింది. సరైన విజయం దొరక్క సుమంత్‌ హీరోగా తనకి అంత సీన్‌ లేదనుకుని, టెక్నీషియన్‌గా, నిర్మాణ రంగం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న టైంలో ఈ సినిమా సబ్జెక్ట్‌ తన దగ్గరకు వచ్చింది. డిఫరెంట్‌ సబ్జెక్స్‌ని ప్రస్తుతం జనం ఆదరిస్తున్నారు. సో హీరోగా లాస్ట్‌ అటెంప్ట్‌ అనుకున్నాడు కాబోలు వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పేశాడు సుమంత్‌. మల్లిక్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా సుమంత్‌ని హీరో స్థాయిలో నిలబెడుతుందో? లేక నిర్మాతగా మారేలా చేస్తుందో చూడాలి మరి.