టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?

నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం ద‌క్కుతుందా ? అన్న ప్ర‌శ్న‌కు ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మాత్రం క‌ష్ట‌మే అన్న ఆన్స‌ర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విష‌య‌మై ఆందోళ‌న‌తో చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్‌కు బ‌ల‌మైన రాయల‌సీమ‌లోనే ఈ ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంతో సీమ‌లో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఇక ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల‌, అర‌కు ఎంపీ కూడా టీడీపీ చెంత చేరారు. ఇక ఎమ్మెల్సీలు, ఇత‌ర స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు కూడా భారీగానే టీడీపీలోకి వ‌చ్చేశారు. ఇక ఈ వ‌ల‌స‌ల ప‌రంప‌ర నంద్యాల ఉప ఎన్నిక రిజ‌ల్ట్ త‌ర్వాత మ‌రింత ఊపందుకోనుంది.

నంద్యాల ఫ‌లితం త‌ర్వాత చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల్లో ఆ పార్టీ ఫ్యూచ‌ర్‌పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిపోయింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏకంగా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గంప‌గుత్త‌గా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో ఆ 11 మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతున్నాయి.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న ఎమ్మెల్యేల్లో విశ్వ‌న‌రాయ క‌ళావ‌తి (పాల‌కొండ‌), బాల‌నాగిరెడ్డి (మంత్రాల‌యం), కొక్క‌లిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి (తిరువూరు), మేకా ప్ర‌తాప్ అప్పారావు (నూజివీడు), కోన ర‌ఘుప‌తి (బాప‌ట్ల‌), షేక్ ముస్త‌ఫా (గుంటూరు తూర్పు), జంకే వెంక‌ట‌రెడ్డి (మార్కాపురం), చింత‌ల రామ‌చంద్రారెడ్డి (పీలేరు), జ‌య‌రామిరెడ్డి (మైదుకూరు), అంజ‌ద్ బాషా (క‌డ‌ప‌), శ్రీకాంత్‌రెడ్డి (రామ‌చోటి) పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ జంపింగ్ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ స‌న్నిహితుడు అయిన రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వం వ‌హిస్తున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్రీకాంత్‌రెడ్డితో క‌డప జిల్లాకే చెందిన టీడీపీ ఎంపీ సీఎం.ర‌మేష్ నేతృత్వం వ‌హిస్తున్న‌ట్టు కూడా టాక్‌. ఏదేమైనా ఈ ఎమ్మెల్యేలంతా ఒకేసారి పార్టీ మారితే అది వైసీపీలో పెనుసంక్షోభానికి దారితీయ‌డం ఖాయం.