2017లో టాలీవుడ్‌లో మామూలు మ‌జా కాదు..

January 6, 2017 at 6:06 am
10

2016 టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సంవత్సరం. గ‌తేడాది సంక్రాంతి నుంచే అస‌లు మ‌జా స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గ‌తేడాది భారీ సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. భారీ వసూళ్లు సాధించాయి. ఈ క్ర‌మంలోనే 2017 టాలీవుడ్‌లో గ‌తేడాది కంటే చాలా గొప్ప‌గా ఉంటుందంటున్నారు.

2017లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఇక్క‌డ అంచ‌నాల‌ను దుమ్ములేపుతున్నాయి. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ అంచ‌నాలు ఉన్న బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది. శంకర్ విజువల్ వండర్ ‘2.0’ రాబోయేది కూడా ఈ ఏడాదే. ఆ చిత్రం దీపావళి కానుకగా విడుదలవుతుంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు.. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద కూడా మామూలు హైప్ ఉండదు. ఈ సినిమా స‌మ్మ‌ర్‌లోనే….బ‌హుశా బాహుబలి 2 త‌ర్వాత రావ‌చ్చు. ప‌వ‌న్ కాట‌మ‌రాయుడుతో పాటు, ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చే సినిమా సైతం వ‌చ్చే యేడాదే రానుంది.

అల్లు అర్జున్-హరీష్ శంకర్ దువ్వాడ జ‌గ‌న్నాథం, ఎన్టీఆర్ – బాబి, చెర్రీ-సుకుమార్‌, మ‌హేష్‌-కొర‌టాల శివ ఇలా చాలా క్రేజీ ప్రాజెక్టులు ఈ యేడాది రిలీజ్ అవుతున్నాయి. సో ఈ లెక్క‌న చూస్తే టాలీవుడ్‌లో 2017 సినీ ప్రియుల‌కు మ‌స్తు మ‌జా ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

 

2017లో టాలీవుడ్‌లో మామూలు మ‌జా కాదు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts