2017లో దిల్ రాజు బిజినెస్ చూస్తే షాక‌వ్వాల్సిందే

January 4, 2017 at 5:42 am
Dil Raju

అగ్ర నిర్మాత దిల్ రాజు కొద్ది రోజులుగా పెద్ద ప్రాజెక్టు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అగ్ర హీరోల డేట్లు మాత్రం స‌ర్దుబాటు కావ‌డం లేదు. 2017 దిల్ రాజుకు చాలా కీల‌కం కానుంది. ఈ యేడాది మ‌హేష్‌బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో అశ్వ‌నీద‌త్‌తో క‌లిసి రాజు నిర్మించ‌నున్నాడు. ఈ యేడాది ద్వితియార్థంలో ఈ ప్రాజెక్టు సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది.

ఇక ఈ యేడాది రాజు బ్యాన‌ర్ నుంచి చాలా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. మొదటగా సంక్రాంతికి శతమానం భవతి అంటూ శర్వానంద్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టికే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో అంచ‌నాలు పెంచేసింది. రెండు పెద్ద సినిమాల మ‌ధ్య‌లో కూడా రాజు త‌న సినిమాను రిలీజ్ చేస్తున్నాడంటే ఎంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

స‌మ్మ‌ర్‌కు అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న దువ్వాడ జ‌గ‌న్నాథం రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కాస్త ముందుగానే నాని – కీర్తి సురేష్ న‌టించిన నేను లోక‌ల్ రిలీజ్ కానుంది. ఇక స‌మ్మ‌ర్ చివ‌ర్ల‌నే డీజే మూవీ త‌ర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఫిదా రానుంది.

ఆ త‌ర్వాత ఈ యేడాది ద్వితియార్థంలో ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కే సినిమా రూపొంద‌నుంది. క్రేజీ డైరెక్ట‌ర్ మణిరత్నం డ్యుయెట్ కు తెలుగు వెర్షన్ నిర్మాత దిల్ రాజే. ఈ సినిమాల బిజినెస్ అన్నీ క‌లుపుకుంటే ఈ యేడాది దిల్ రాజు ఓవ‌రాల్‌గా రూ. 130 కోట్ల‌కు పైగా బిజినెస్ చేస్తాడ‌ని టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి

 

2017లో దిల్ రాజు బిజినెస్ చూస్తే షాక‌వ్వాల్సిందే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts