వివేకం TJ రివ్యూ

August 24, 2017 at 9:26 am
Vivekam

టైటిల్: వివేకం

జానర్: స్పై థ్రిల్లర్

న‌టీన‌టులు: అజిత్ కుమార్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్

మ్యూజిక్‌: అనిరుధ్

సినిమాటోగ్ర‌ఫీ: వెట్రీ

నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్

దర్శకత్వం: శివ

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

ర‌న్ టైం: 149 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 24 ఆగ‌స్టు, 2017

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల త‌ర్వాత అజిత్ – శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ హ్యాట్రిక్ హిట్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన వివేకం అంచ‌నాలు అందుకుందో ? లేదో TJ స‌మీక్షలో చూద్దాం.

కథ :

బెస్ట్ ఫ్రెండ్ వివేక్ ఒబెరాయ్‌తో క‌లిసి అజ‌య్‌కుమార్ (అజిత్‌) బల్గెరియాలో “స్పై” గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరు చాలా తెలివిగల వారు. వారిని పట్టుకోడానికి ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు. టెర్రరిస్ట్స్ అంతు చూస్తూ ఉంటారు. అజిత్ ఒక న్యూక్లియర్ వెపన్ కూడా తయారు చేస్తాడు. వివేక్ ఒబెరాయ్‌తో పాటు మ‌రో న‌లుగురు అజిత్ టీంలో ఉంటారు. ఇక నటాషా (అక్ష‌ర‌హాస‌న్‌) ఒక హ్యాక‌ర్‌. ఆమె భూకంపం సృష్టించే మిష‌న్ త‌యారు చేస్తుంటుంది. ఆమెను అజిత్ టీం ప‌ట్టుకుంటుంది.

ఈ క‌థ ఇలా సాగుతుండ‌గానే గర్భవతి అయిన “అజిత్” భార్య హాసిని (కాజ‌ల్‌)ను టార్గెట్ చేస్తారు అక్షర టీం. ఈ టైం లో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. అజిత్ ఫ్రెండ్ వివేక్ ఒబెరాయ్ అక్షర వాళ్ళతో చేతులు కలుపుతాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కృతిమ భూకంపాలను సృష్టించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలను సృష్టించేందుకు అంతర్జాతీయ తీవ్రవాదులు ప్లాన్ చేస్తారు. ఈ ప్రయత్నాలను అజయ్ కుమార్ ఎలా అడ్డుకున్నాడు..? ఉగ్ర‌వాదుల నుంచి త‌న భార్య‌ను ఎలా కాపాడుకున్నాడు ? అసలు అజయ్ రహస్య జీవితం ఎందుకు గడుపుతున్నాడు..? అన్నదే మిగతా కథ.

TJ విశ్లేష‌ణ :

అజిత్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కిన వివేకంలో సినిమాను అంతా అజిత్ త‌న భుజ‌స్కంధాల మీదే మోశాడు.స్టైలీష్‌గాను, యాక్ష‌న్ స‌న్నివేశాల్లోను అజిత్ న‌ట‌న పీక్ స్టేజ్‌లో ఉంది. కాజ‌ల్ అజిత్ భార్య‌గా హుందా రోల్‌లో మెప్పించింది. కీల‌క పాత్ర‌లో క‌నిపించిన అక్ష‌ర హాస‌న్ తెర‌మీద క‌నిపించింది త‌క్కువ సేపే అయినా గుర్తుండి పోయే రోల్‌లో చేసింది. వివేక్ ఒబెరాయ్ విల‌న్ క్రిష్ సినిమాలోని న‌ట‌న‌ను గుర్తు చేసింది. వివేక్ విల‌నిజం బాగుంది.

ఇంట‌ర్నేష‌న‌ల్ స్టోరీని ఓ ప్రాంతీయ భాషా సినిమాగా తెర‌కెక్కించే విష‌యంలో ద‌ర్శ‌కుడు శివ ప్ర‌య‌త్నాన్ని అభినందించాల్సిందే. సినిమా అంతా హాలీవుడ్ స్థాయిలో ఉండాల‌న్న త‌ప‌న‌తో అత‌డు లోక‌ల్ ఆడియెన్స్‌ను సినిమాకు క‌నెక్ట్ చేయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. సినిమాలో ప్ర‌తి 10 నిమిషాల‌కు ఓ సారి వ‌చ్చే యాక్ష‌న్ ఎలిమెంట్స్ కేక పుట్టిస్తాయి. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదుర్స్‌. అజిత్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ మసాలా ఎలిమెంట్స్ సినిమాలో లేవు.

హాలీవుడ్ టేకింగ్ స్టైల్లో సినిమాలు కావాల‌నుకునే వారికి ఈ సినిమా బాగా న‌చ్చుతుంది కాని సాధార‌ణ ప్రేక్ష‌కుడు మాత్రం చాలా గంద‌ర‌గోళానికి గుర‌వుతాడు. సినిమాలో చాలా సీన్లు లాజిక్ లేకుండా ఉంటాయి. చేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అనిరుథ్ మ్యూజిక్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. వెట్రీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయి సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చాయి.

ప్లస్ పాయింట్స్ (+) :

– అజిత్ స్టైలీష్ యాక్టింగ్‌

– ఆర్ ఆర్‌

అజిత్ నటన

– క‌ళ్లు చెదిరిపోయే విజువల్స్

– యాక్షన్ సీన్స్

– ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌

మైనస్ పాయింట్స్ (-) :

– లాజిక్ లేని సీన్స్

– పాటలు

– బ‌ల‌హీన‌మైన క‌థ‌

– స్లో సెకండాఫ్‌

ఫైన‌ల్ పంచ్‌: హాలీవుడ్ స్టైల్‌ వివేకం

వివేకం మూవీ TJ రేటింగ్‌: 2.25 / 5

 

వివేకం TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts