కృష్ణా టీడీపీలో ఉమా ఒక్క‌డే ఒక‌వైపు…అంద‌రూ ఒక వైపు..

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద కృష్ణా జిల్లా పేరు చెప్ప‌గానే ముందుగా ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావే గుర్తుకు వ‌స్తారు. కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమాకే చంద్ర‌బాబు వ‌ద్ద ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఉంటుంది. పార్టీలో ఎంత‌మంది ఉన్నా చంద్ర‌బాబు మాత్రం ముందుగా ఉమా చెప్పిన‌ట్టే వింటార‌న్న టాక్ ఉంది. ఉమా జిల్లాలో పార్టీని డ‌వ‌ల‌ప్ చేసే విష‌యంలో దూకుడుగాను, స్పీడ్‌గాను ఉన్నా పార్టీలో మిగిలిన వారిని ఎద‌గ‌నీయ‌కుండా..తాను హైప్ అయ్యేందుకు ర‌క‌ర‌కాల ఎత్తులు వేస్తార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌న‌పై ఉన్నాయి.

కృష్ణా జిల్లా టీడీపీలో ఉమా కంటే ఎంతోమంది సీనియ‌ర్లు ఉన్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న గ‌ద్దే రామ్మోహ‌న్‌, కాగిత వెంక‌ట్రావు, మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ ఉమా కంటే చాలా సీనియ‌ర్లు. కానీ వీరి పేర్లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కో లేదా ఆ జిల్లాకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతూ ఉంటాయి. కేవ‌లం తాను మాత్ర‌మే ఎద‌గాలి…చంద్ర‌బాబు వ‌ద్ద త‌న పేరే హైలెట్ అవ్వాల‌న్న ఉమా సంకుచిత మ‌న‌స్తత్వంతో ఇప్పుడు ఆయ‌న జిల్లాలో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలంద‌రికి టార్గెట్ అవుతున్నాడ‌న్న చర్చ‌లు కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల విష‌యానికే వ‌స్తే ఉమాకు అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన బుద్ధ ప్ర‌సాద్ ఉమా పేరు చెపితేనే మండిప‌డుతున్నారు. ఇక గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఉమాకు మ‌ధ్య ఎప్ప‌టి నుంచో గ్యాప్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ లీడ‌ర్‌, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దే రామ్మోహ‌న్‌కు ఉమాకు స‌రైన స‌త్స‌బంధాలు లేవు.

ఇక మ‌రో సీనియ‌ర్‌, పెడ‌న ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు సైతం ఉమా పేరు చెపితేనే ఓపెన్‌గానే ఫైర్ అవుతున్నారు. వెంక‌ట్రావు ఇటీవ‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గానికి నీరు రానివ్వ‌డం లేదంటూ ప‌రోక్షంగా ఉమాపై ఫైర్ అయ్యారు.ఇక ఇటీవ‌ల త‌న‌కు మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం వెన‌క కూడా ఉమా హ్యాండ్ ఉన్న‌ట్టు వెంక‌ట్రావు త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీలో ఉన్న‌ప్పుడు సైతం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లేందుకే ఉమా వెనుక‌డుగు వేసేవారు. నానికి ఉమాకు అస్స‌లు పొసిగేది కాదు. ఇక విజ‌య‌వాడ‌లో ప‌ట్టుకోసం ట్రై చేస్తోన్న ఉమాకు ఎంపీ కేశినేని నానితో పాటు సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతున్నారు. ఎంపీ నాని ఇప్ప‌టికే ఉమా తీరుపై ఓపెన్‌గానే విమ‌ర్శ‌లు చేశారు. ఆ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా వెళ్లింది. ఇక తాజా విస్త‌ర‌ణ‌లో ఎంపీ నాని సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకు మంత్రి ప‌ద‌వి ఇప్పించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసినా చివ‌రి క్ష‌ణంలో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. వీరిద్ద‌రు ఇప్పుడు మంత్రి ఉమాకు యాంటీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఓవ‌రాల్‌గా చూస్తే నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేలు ఒక‌రిద్ద‌రు మిన‌హా ఇప్పుడు జిల్లాలోని టీడీపీ సీనియ‌ర్లు అంద‌రూ ఉమా వ‌న్ మ్యాన్ షోకు యాంటీగా ఒక్క‌ట‌వుతున్నార‌న్న గుస‌గుస‌లు కృష్ణా టీడీపీలో వినిపిస్తున్నాయి. ఉమాపై వీరి పోరాటం తీవ్ర‌త‌ర‌మ‌య్యేలాగానే క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే పార్టీలో లుక‌లుక‌లు తీవ్ర‌త‌ర‌మై పార్టీకి భారీ న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఈ విష‌యంపై కాస్త కాన్‌సంట్రేష‌న్ చేస్తే బాగుంటుందేమో..!