” DJ ”  2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ – DJ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఉన్న భారీ హైప్‌తో మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా DJ ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో రూ. 18 కోట్ల షేర్ రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే రెండో రోజు శ‌నివారం కూడా క‌లుపుకుని మొత్తం రెండు రోజుల‌కు రూ.26.71 కోట్ల షేర్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.

నైజాంలో DJ దూకుడు ఓ రేంజ్లో ఉంది. ఇక సీడెడ్‌, ఉభ‌య‌గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌లోను DJ జోరు రెండో రోజు కూడా కంటిన్యూ అయ్యింది. దాదాపు అన్ని థియేట‌ర్ల‌లో ఫుల్ ఆక్యుపెన్స ఉంది. ఇక ఆదివారం, సోమ‌వారం రంజ‌న్ సెల‌వులు ఉండ‌డంతో తొలి నాలుగు రోజుల‌కే DJ భారీ వ‌సూళ్లు న‌మోదు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

DJ 2 రోజులు ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి… (రూ.కోట్ల‌లో)

నైజాం – 8.32

సీడెడ్ – 4.05

ఉత్తరాంధ్ర – 3.13

గుంటూరు – 2.80

కృష్ణా – 1.61

ఈస్ట్ గోదావ‌రి – 3.06

వెస్ట్ గోదావ‌రి – 2.41

నెల్లూరు – 1.33

—————————-

మొత్తం = 26.71 కోట్లు

—————————-