డీజే అవుట్ ఫుట్ చూసి బ‌న్నీ ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఈ నెల 23న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. బ‌న్నీ చివ‌రి నాలుగు సినిమాలు రూ.50 కోట్ల షేర్ క్ల‌బ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు లేదు. ఇక గ‌తేడాది వ‌చ్చిన మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు త‌ర్వాత బ‌న్నీ క్రేజ్ సౌత్ టు నార్త్ మార్మోగిపోతోంది. బ‌న్నీ డీజే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక డీజేకు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది.

బ‌న్నీ సినిమాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడ‌ని, ప్ర‌తి సీన్ అయ్యాక అవుట్ ఫుట్ జాగ్ర‌త్త‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడ‌న్న టాక్ ఉంది. ఈ డీజే సినిమాకు రిలీజ్‌కు ముందే అదిరిపోయే బ‌జ్ ఉంది. బ‌న్నీ సినిమా కోసం మంచి క‌థ‌, డైలాగ్స్ రాయించుకోవ‌డంతో పాటు బ్రాహ్మ‌ణ పాత్ర‌లో ఒదిగిపోయేందుకు చాలా కేర్ తీసుకున్నాడు. తీరా చూస్తే ఇప్పుడు సినిమా అవుట్ ఫుట్ చూశాక బ‌న్నీకి పెద్ద‌గా న‌చ్చలేద‌ని తెలుస్తోంది.

ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న ఇన్‌సైడ్ సోర్సెస్ ప్ర‌కారం ఇండ‌స్ట్రీలో డీజే మీద అంత మంచి అభిప్రాయాలు ఎవ్వ‌రికి లేవ‌ట‌. సినిమా మ‌హా అయితే యావ‌రేజ్ అంటున్నారు. అంత‌కు మించి సీన్‌లేద‌ట‌. అందుకే బ‌న్నీకి సైతం అవుట్ ఫుట్ పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో తీవ్ర అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. బ‌న్నీ సినిమాల అవుట్ ఫుట్‌ను ముందుగా గీతా ఆర్ట్స్ సంస్థ‌లోని వ్య‌క్తులు చూస్తుంటారు.

అయితే డీజే విష‌యంలో వాళ్లు దిల్ రాజుతో ఏమైనా తేడా వ‌స్తుందేమో అన్న డౌట్‌తో అవుట్ ఫుట్‌పై స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేద‌ట‌. దీంతో ఫైన‌ల్ అవుట్ ఫుట్ చూసుకున్నాక పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో బ‌న్నీ వారిపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఈ క‌థ‌నాలు ఎలా ఉన్నా డీజే ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ? తెలియాలంటే ఈ నెల 23 వ‌ర‌కు ఆగాల్సిందే.