బ‌న్నీకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా..

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్లే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బ‌న్నీ గ‌త నాలుగు సినిమాల రిజ‌ల్ట్ చూసుకుంటే సినిమాల‌కు వ‌చ్చిన టాక్‌కు వ‌సూళ్ల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌డం లేదు. బ‌న్నీకి ఇప్పుడు క్రేజ్ వ‌చ్చేసింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టేస్తున్నాడు.

రేసుగుర్రంకు ముందు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. త‌ర్వాత ప్ర‌మోష‌న్లు ఊద‌ర‌గొట్ట‌డం, కేర‌ళ మార్కెట్లో ఊపేయ‌డంతో రూ.60 కోట్లు కొల్ల‌గొట్టేసింది. సన్నాఫ్ సత్యమూర్తికి ముందు నెగిటివ్ టాక్‌. రివ్యూలు స‌రిగా రాలేదు. అయితే ఆ సినిమా కూడా రూ.55 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక స‌రైనోడుకు కూడా ముందు ప్లాప్ టాక్ వ‌చ్చింది. రివ్యూవ‌ర్లు రొటీన్ అని ఏకేశారు.

ఆ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా షేర్ రాబ‌ట్టి, బ‌న్నీ కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ సినిమాకు సైతం డివైడ్ టాక్ వ‌చ్చాక ప్ర‌మోష‌న్లు ఓ రేంజ్‌లో చేశారు. ఇక ఈ మూడు సినిమాల‌కు రిలీజ్ టైం బాగా ప్ల‌స్ అయ్యింది. స‌మ్మ‌ర్‌లో ఎవ్వ‌రూ పోటీ లేకుండా రావ‌డం వీటికి క‌లిసొచ్చింది.

ఇక ఇప్పుడు డీజేకు అంతే. రివ్యూలు నెగిటివ్‌గా ఉన్నా సినిమా మూడు రోజుల్లో రూ.60 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసిందంటున్నారు. మ‌రో రెండు వారాల పాటు డీజేకు పోటీ సినిమా కూడా లేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా స‌క్సెస్ మీట్‌లు అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు.

బ‌న్నీ హీరోగా ఓ రేంజ్‌కు వ‌చ్చేశాడు. క‌థ‌ల విష‌యంలో చాలా కేర్‌లెస్‌గా ఉంటున్నాడ‌న్న‌ది బ‌న్నీ ఎంచుకుంటోన్న క‌థ‌లు చూస్తేనే తెలుస్తోంది. హీరోగా కొంత వ‌ర‌కు స్టాండ‌ర్డ్ మార్కెట్ ఏర్ప‌రుచుకోవ‌డంతో బ‌న్నీ ఇప్పుడు ఓవ‌ర్ కాన్పిడెన్స్‌తో క‌థలు ఎంచుకుంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. వ‌సూళ్లు వ‌స్తుండ‌డంతో మ‌నోడు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ట్టు ఉంది. అయితే ఇదే కంటిన్యూ అయితే ఈ ప‌ద్ధ‌తి ఎన్నో రోజులు సాగ‌దు. త‌ర్వాత బ‌న్నీ బొక్క‌బోర్లాప‌డ‌క త‌ప్ప‌దు.