DJ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌…క‌ళ్లు తిర‌గాల్సిందే

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్- పూజాహెగ్డే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు కొంత మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా ఫ‌స్ట్ డే మాత్రం వ‌సూళ్ల‌లో దుమ్ము రేపేసింది. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన 25వ సినిమా కావ‌డంతో ఆయ‌న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు.

ఇక బ‌న్నీ నాలుగు వ‌రుస రూ.50 కోట్ల సినిమాలతో తిరుగులేని జోరు మీద ఉండ‌డంతో డీజేకు ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ అయిన డీజే అక్క‌డ కేవ‌లం ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల 50వేల డాలర్లను( 2.25 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లో హయ్యస్ట్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా డీజే నిలిచింది.

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా డీజే ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రూ. 33 కోట్లుగా ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల ప్రాథమిక అంచ‌నా. ఇక బ‌న్నీ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన స‌రైనోడు సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు 14.40 కోట్ల రూపాయలు వ‌సూలు చేస్తే డీజే రూ. 25 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇక శ‌ని, ఆదివారాలు కూడా సెల‌వులు కావ‌డంతో డీజేకు ఈ రెండు రోజుల్లో మరిన్ని వ‌సూళ్లు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ద‌గ్గ‌ర‌లో డీజేకు పోటీగా ఏ సినిమా లేక‌పోవ‌డం కూడా క‌లిసిరానుంది.