అమ‌లాపాల్ రెండో పెళ్లి క‌న్‌ఫార్మ్‌

August 15, 2017 at 6:03 am
amala paul

హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు విజ‌య్ మిల్ట‌న్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధంలో యేడాదికే తీవ్ర‌మైన క‌ల‌త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రికి ఒక‌రంటే మ‌రొక‌రికి ఇష్టం ఉన్నా విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో అమ‌ల‌కు వ‌చ్చిన తీవ్ర‌మైన గ్యాప్ వ‌ల్లే వీరి విడిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఏదైతేనేం చూడ చ‌క్క‌ని జంట‌గా ఉన్న అమ‌ల‌-విజ‌య్ విడిపోయారు.

విజ‌య్‌తో విడిపోయాక కూడా అమ‌లాపాల్ గురించి విజ‌య్‌… విజ‌య్ గురించి అమ‌లాపాల్ చెడుగా ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. ఇప్ప‌టికీ ‘విజ‌య్ మంచోడే’ అంటుంది అమ‌లాపాల్‌. త‌మ అనుబంధం ఇంత త్వ‌ర‌గా ముగుస్తుంద‌ని తాము అనుకోలేద‌ని ఆమె బాధ‌ప‌డుతుంటుంది. విజ‌య్ అంటే ఇప్ప‌ట‌కీ త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని, త‌న‌ను చాలా బాగా చూసుకున్నాడ‌ని అమ‌ల చెపుతుంటుంది.

ఇక విజ‌య్‌తో విడిపోయిన అమ‌ల మ‌ళ్లీ పెళ్లీకి రెడీ అవుతోన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ప్రేమ‌, పెళ్లిలో ఓ సారి ఫెయిల్ అయినంత మాత్రానా ప్రేమ – వివాహ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు ఇంకా న‌మ్మ‌కాలు ఉన్నాయంటోంది. మ‌రి మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మేనా ? అన్న ప్ర‌శ్న‌కు ఆమె షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది.

త‌న జీవితాన్ని ఇలా ఒంట‌రిగా గ‌డిపేసేందుకు తాను సిద్ధంగా లేన‌ని, జీవితంలో ఒక‌రి తోడు మ‌రొక‌రికి అవ‌స‌రం. అయితే ఈసారి చేసిన త‌ప్పు చేయ‌కూడ‌దు. తాను త్వ‌ర‌లోనే ఓ తోడును వెతుక్కొనున్న‌ట్టు చెప్పింది. అయితే ఈ సారి ఎలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా చూసుకుంటానంటోంది. సో అమ‌ల రెండో పెళ్లికి రెడీ అయిపోతుంద‌న్న‌మాట‌.

 

అమ‌లాపాల్ రెండో పెళ్లి క‌న్‌ఫార్మ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts