ఆంధ్ర ఎంపీకి కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీసులో అవమానం

అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్‌ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా కార్యాలయంలోకి అనుమతించలేదని చెప్పారు . తన వివరాలు తనిఖీ చేసుకోవాలని ఆరగంట సమయం ఇచ్చానన్నారు. రోడ్డుపై ఎండలో మెయిన్‌ గేటు వద్దే తనను నిలిపేశారని రవీంద్రబాబు తెలిపారు. ఎంపీ అయిన తనకే ఇలా అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రోటోకాల్‌ తెలియని భద్రతా సిబ్బందితో ప్రజాప్రతినిధులకు సమస్యలను తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో మరల ఇటువంటి పొరపాట్లు జరగకుండా అటు ప్రభుత్వం మరియు ఇటు కెసిఆర్ దృష్టి సారించాలి.