టాప్ రేటుకు ‘ ఆనందో బ్ర‌హ్మ ‘ శాటిలైట్ రైట్స్‌

తాప్సీ ప్ర‌ధాన‌పాత్ర‌లో మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ‌ర్ర‌ర్‌+కామెడీ జాన‌ర్ సినిమా ఆనందో బ్ర‌హ్మ‌. ఈ నెల 18న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాల‌కు మ‌నుష్యులు భ‌య‌ప‌డ‌డం అనే కాన్సెప్ట్‌లో మ‌నం చాలా సినిమాలు చూశాం. అయితే ఈ సినిమాలో రివ‌ర్స్‌గా మనుషులకు దెయ్యాలు భయపడ‌తాయి.

సినిమాలో కామెడీ అదిరిపోవ‌డంతో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఉన్న సినిమాల్లో కామెడీ సినిమాలేవి లేక‌పోవ‌డం కూడా ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో సైతం మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది.

తాజాగా చిత్ర శాటిలైట్ హక్కులకు మంచి ధర పలికింది. ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను రూ 3.25 కోట్ల‌కు సొంతం చేసుకుంది. దీంతో సినిమా బిజినెస్ భారీ మొత్తంలో జరిగినట్టైంది. ఇక ఆనందో బ్ర‌హ్మ లాంగ్ ర‌న్‌లో రూ. 25 కోట్ల షేర్ సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా. ఈ సినిమాకు మొత్తం అయిన బ‌డ్జెట్టే రూ. 3 కోట్లు. ఈ లెక్క‌న ఆనందో బ్ర‌హ్మ నిర్మాత‌ల ఖాతాలో భారీ లాభాలు ప‌డ్డాయి.