ఆనందో బ్ర‌హ్మ‌ TJ రివ్యూ

టైటిల్‌: ఆనందో బ్ర‌హ్మ‌

జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ

నటీనటులు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్

మ్యూజిక్‌: కృష్ణ కుమార్

నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

దర్శకత్వం: మహి వి రాఘవ్

రిలీజ్ డేట్‌: 18 ఆగ‌స్టు, 2017

ఇటీవ‌ల సౌత్ ఇండియా సినిమా స్క్రీన్‌పై హీరోయిన్ ఓరియంటెడ్ రోల్‌లో హ‌ర్ర‌ర్‌+కామెడీ జాన‌ర్‌లో సినిమాలు రావ‌డం ఎక్కువైంది. ఈ క్ర‌మంలోనే తాప్సీ, ప్ర‌ముఖ క‌మెడియ‌న్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఆనందో బ్ర‌హ్మ‌. ట్రైల‌ర్ల‌తోనే ఆస‌క్తిని రేపిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

మలేషియాలో నివసించే రాజీవ్ కనకాల తన తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చ‌నిపోతారు. దీంతో హైద‌రాబాద్‌లో ఉండే త‌న ఇంటిని అమ్మేయాల‌ని డిసైడ్ అవుతాడు. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయ‌న్న ప్ర‌చారంతో దానిని త‌క్కువ రేటుకే అమ్మ‌కానికి పెట్టాల్సి ఉంటుంది. ఆ ఇంటికి ఎక్కువ రేటు ప‌ల‌కాల‌న్న ప్లాన్‌తో ఆ ఇంట్లో దెయ్యాలు లేవ‌ని చెప్పేందుకు రాజీవ్ దానిని ఫ్రీగా అద్దెకు ఇచ్చేస్తాడు. ఆ ఇంట్లో అద్దెకు ఉండేందుకు నలుగురు కుర్రాళ్లు వస్తారు. ఆ నలుగురిలో ఒకొక్కరికి ఒకో వీక్నెస్ ఉంటుంది. వెన్నెల కిషోర్ చెవిటి మరియు గుడ్డివాడు. షకలక శంకర్ స్ప్లిట్ పర్సనాలిటీ కలవాడు. ఏ సినిమా చూస్తే ఆ క్యారెక్టర్‌లోకి ఎంట‌ర్ అయిపోతాడు.

తాగుబోతు రమేష్ ఉదయం చాలా సాఫ్ట్ గా ఉంటాడు, సాయంత్రం అవ్వగానే చుక్క పడేసరికి వైయొలెంట్ గా తయారవతుడు. ఇక శ్రీనివాస్ రెడ్డి చాలా తేడా…సంతోషం వస్తే ఏడుస్తాడు, బాధ కలిగితే న‌వ్వుతాడు. వీరంతా ఆ దెయ్యాన్ని ఎలా ఎదురుకున్నారు ? ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు ? ఉంటే అవి ఏం చేశాయి ? అసలు రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ? అనేదే ఈ సినిమా కథ.

TJ విశ్లేష‌ణ‌:

కామెడీ హర్రర్ జోనర్‌లో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లో దెయ్యాల‌కు మ‌నుష్యులు భ‌య‌ప‌డడం అనే అంశం చుట్టూనే క‌థ తిరుగుతూ ఉంటుంది. దెయ్యాలకు, నలుగురు కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిశోర్ లకు మధ్య నడిచే హర్రర్ కామెడీ సన్నివేశాలు భలేగా నవ్వించాయి. ఈ న‌లుగురికి ఉన్న నాలుగు వీక్‌నెస్‌లు స్క్రీన్ మీద బాగా హైలెట్ అయ్యాయి. దర్శకుడు మహి వి రాఘవ మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నా స్క్రీన్ ప్లే కాస్త క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉండ‌డం మైన‌స్ అయ్యింది. ఇక తాప్సీ న‌ట‌న సినిమాకు మేజ‌ర్ హైలెట్‌గా నిలిచింది. సినిమా అక్క‌డ‌క్కడా స్లో అవ్వ‌డం, అనుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేక‌పోవ‌డం కూడా మైన‌స్సే. ఇక ఓవ‌రాల్‌గా జ‌స్ట్ ఓకే అనిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– కామెడీ

– తాప్సీ పెర్పామెన్స్‌

– శ్రీనివాస్‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్ కామెడీ

– ర‌న్ టైం

మైన‌స్ పాయింట్స్ (-):

– కాస్త వీక్‌గా ఉన్న స్టోరీ

– స్లో అయిన ఫ‌స్టాఫ్‌

– హ‌ర్ర‌ర్‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డం

– క‌న్విన్సింగ్‌గా లేని క్లైమాక్స్‌

TJ ఫైన‌ల్ పంచ్‌:

స‌గం ఆనంద‌మే బ్ర‌హ్మ‌

TJ ఆనందో బ్ర‌హ్మ మూవీ రేటింగ్‌: 2.75 / 5