‘ ఆనందో బ్ర‌హ్మ ‘ వ‌సూళ్ల‌తో ఆనంద‌మే…

August 21, 2017 at 12:35 pm
anando brahma

ఆనందో బ్ర‌హ్మ సినిమా వ‌సూళ్ల‌తో చిత్ర యూనిట్ మొత్తం ఆనందంలో మునిగి తేలుతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కు క‌లిపి ఈ సినిమా రూ 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టింది. శ‌ని, ఆదివారాల్లో అన్ని సెంటర్ల‌లోను 100 శాతం ఆక్యుపెన్సీతో ఉండ‌డంతో అంద‌రూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఓవ‌ర్సీస్‌లోనే ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు త‌క్కువ స్క్రీన్లు ప‌డినా రూ 2.25 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

కేవ‌లం రూ. 3 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో ఇక్క‌డ రూ. 25 కోట్ల గ్రాస్‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో రూ. 5 కోట్ల గ్రాస్ సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి మొదటి చిత్రంగా భలే మంచి రోజు వంటి సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు అదే బ్యాన‌ర్‌లో వ‌చ్చిన రెండో సినిమా కూడా భారీ హిట్ అందుకుంది.

 

‘ ఆనందో బ్ర‌హ్మ ‘ వ‌సూళ్ల‌తో ఆనంద‌మే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts