‘ ఆనందో బ్ర‌హ్మ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే

August 18, 2017 at 4:52 am
add_text333

సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. సౌత్‌లో ఇటీవ‌ల హీరోయిన్లు ప్ర‌ధాన‌పాత్ర‌లో హ‌ర్ర‌ర్‌+కామెడీ జాన‌ర్‌లో సినిమాలు రావ‌డం కామ‌న్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే వాటిల్లో చాలా వ‌ర‌కు హిట్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చిన చిత్రం ఆనందో బ్ర‌హ్మ‌.

తాప్సి, కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌కు ముందు వ‌చ్చిన ట్రైల‌ర్‌తో ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా యూఎస్‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షో కంప్లీట్ చేసుకుంది. 

ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం నలుగురు కమెడియన్లు ఈ చిత్రంలో ఉన్నారంటే ప్రేక్షకులు కచ్చితంగా మంచి కామెడీని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆనందో బ్రహ్మ ఉంది. ముందు నుంచి అనుకున్న‌ట్టుగా హ‌ర్ర‌ర్‌+కామెడీ జాన‌ర్‌లోనే తెర‌కెక్కినా క‌థ‌లో మాత్రం కొత్త‌ద‌నం ఉంద‌ని సినిమా చూసిన ప్రేక్ష‌కులు చెపుతున్నారు.

పాత్రల పరిచయాలు, మంచి కామెడీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు ఆసక్తికరంగా ముగించాడు. సెకండ్ హాఫ్ లో కామెడీ అదిరిపోవ‌డంతో పాటు పీక్‌స్టేజ్‌కు చేరుకుంది. ఇక నలుగురు ప్రధాన నటుల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ను థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేసేలా ఉన్నాయ‌ట‌.

షకలక శంకర్, వెన్నెల కిషోర్ తమకే సాధ్యమైన కొన్ని మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్ కూడా మెప్పించాడు. శ్రీనివాస్ రెడ్డి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంది. తాప్సి పాత్ర చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా దర్శకుడు మహి వి రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి క‌మ‌ర్షియ‌ల్‌గా నిలిచే స‌త్తా ఈ సినిమాకు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

‘ ఆనందో బ్ర‌హ్మ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts