అంధ‌గాడు TJ రివ్యూ

సినిమా : అంధ‌గాడు
నటీనటులు:  : రాజ్‌త‌రుణ్,హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు
ఆర్ట్ : కృష్ణ మాయ‌
సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌
చీఫ్ కోడైరెక్ట‌ర్ : సాయి దాసం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : కిషోర్ గ‌రికిపాటి
స‌హ నిర్మాత : అజ‌య్ సుంక‌ర‌
నిర్మాత : రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వం : వెలిగొండ శ్రీనివాస్‌

తెలుగులో కామెడీ ట్రాక్ నమ్ముకొని హిట్ కొట్టే అతి కొద్దిమంది హీరోలో రాజ్ తరుణ్ ఒకడు , ఈసారి కామెడీ నే కాకుండా యాక్షన్ కూడా టచ్ చేస్తూ తీసిన సినిమానే అంధగాడు. కధలో కొత్తదనం లేకపోయినా చెప్పే విధానం, దానికి కామెడీ జోడించి సినిమా తీస్తే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి లాజిక్ నే పట్టుకొని వెళ్ళాడు రాజ్ తరుణ్. ఈడోరకం-ఆడో రకం ,కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త నిర్మిచిన ఆర్ కే సంస్థే అంధగాడు నిర్మిచింది, కుమారి 21F , ఈడోరకం-ఆడో రకం లో జోడి కట్టిన రాజ్ తరుణ్, హెబ్బా పాటిల్ మరొకసారి ఈ సినిమాలో జతకట్టారు. ,రచయితగా ప్రారంభం అయిన వెలుగొండ సినివాస్ తొలిసారి దర్శకత్వం వహించాడు , ఈ కాంబినేషన్ ఎంతవరకు విజయం సాధించిందో చూదాం .

కధ :
కళ్ళు లేని ఒక అనాధ అయిన గౌతమ్ (రాజ్ తరుణ్ ) ఒక అనాధ ఆశ్రమంలో తన స్నేహితులు రాజ్ ,దివ్యతో ఉంటాడు ,ఒక సందర్భం లో గుడ్డివాడు అయిన గౌతమ్ ఆశ్రమం నుండి బయటకు వచ్చి తన కంటి చూపు కోసం కంటి హాస్పటిల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అక్కడ డాక్టర్ నేత్ర (హెబ్బా పాటిల్ ) అనుకోకుండా పరిచయం అవ్వటం ,గౌతమ్ నేత్ర ప్రేమలో పడటం ,తాను గుడ్డివాడు అని తెలిస్తే ఎక్కడ తన ప్రేమకు దూరం అవుతుందో అని కళ్ళు ఉన్నట్టు నటిస్తాడు ,అయితే గౌతమ్ గుడ్డివాడు అని తెలుసుకున్న నేత్ర తనతో అబద్ధం చెప్పాడనే కోపంతో ,గౌతమ్ ప్రేమని రిజక్ట్ చేసి వెళ్లిపోతుంది. కానీ నేత్ర ఆపరేషన్ సహాయం ద్వారా గౌతమ్ కు కళ్ళు వచ్చేలా చేస్తుంది. కళ్ళు వచ్చిన తరువాత నేత్ర గౌతమ్ ముందు మూగదానిగా నటించటం ,తరువాత నేత్ర మూగ కాదని నిజం తెలిసిపోవటం ,ఇద్దరు ప్రేమలో పడిపోవటం జరిగితాయి .అప్పుడే అనుకోకుండా గౌతమ్ కలలో ఒక కార్ నెంబర్ పదే పదే కనిపించటం ,గౌతమ్ కులకర్ణి (రాజేంద్రప్రసాద్ ) కారణం గా బాబ్జి (రాజారవీంద్ర )మనుషులని మర్డర్ చేస్తాడు .అసలు ఈ కులకర్ణి ఎవరు ?గౌతమికి బాబ్జికి ఉన్న సంబంధం ఏమిటి ?కులకర్ణి కి గౌతమ్ కి ఉన్న రిలేషన్ ఏమిటి ? తెలుసుకోవాలంటే ఈ అందగాడు చూడాల్సిందే .

విశ్లేషణ :
రాజ్ తరుణ్  ని పల్లెటూరి అబ్బాయి ,లవర్ బాయ్ లాగా ఇంతక ముందు చిత్రాలలో చూసాం .కానీ ఈ అంధగాడు సినిమాలో గుడ్డివాడి గా బాగా నటించాడు .గుడ్డివారు ఎలా ఉంటారు ,వాళ్ళహాహాభావాలు ఎలా ఉంటాయి అనే దాని పై రాజ్ తరుణ్ బాగానే స్టడీ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో తన బాడీ లాంగ్వేజ్ తో గుడ్డి వాడిగా చాలా బాగా మెప్పించాడు.సెకండ్ హాఫ్ లో కొంత మాస్ యాక్షన్ కలుపుతూ తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తాడు. రాజ్ తరుణ్ నటనలో మెట్చ్యురిటి కనిపించింది . హెబ్బా పాటిల్ తన క్యారక్టర్ వరకు బాగానే చేసింది. సినిమాలో తన అందాలు ఆరబోస్తూ గ్లామర్ గా కనపడింది .రాజేంద్రప్రసాద్ గురించి చెప్పుకొనేది ఏముంది .తన నటన ఎప్పటికి తగ్గదు అని మరొకసారి నిరూపించాడు.

విలన్ రాజారవీంద్ర గురించి చెప్పుకోవాలి .తన మాస్ లుక్ తో విలన్ గా తన క్యారక్టర్ పరంగా బాగానే చేసాడు. సింప్ల్య్ సూపర్ అనొచ్చు .ఆశిష్ విద్యార్థి ,షిండే ,పరుచూరి వెంకటేశ్వరావు ,వాళ్ళపరిదివరకు బాగానే చేసారు .డైరెక్టర్ గురించి చెప్పుకొంటే తన తోలి సినిమా తో సక్సెస్ సాధించాడు అని చెప్పొచ్చు .ఎందుకంటే స్టోరీ పాతదైనా చెప్పేవిధానం ,ఫ్రెష్ లుక్ తో బాగానే చూపించాడు .సంగీతం పరంగా చూసుకొంటే పాటలు పర్వాలేదనిపించాయి .బాక్గ్రౌండ్ స్కోర్ పరవాలేదు ,ఫోటోగ్రఫీ బాగుంది .ప్రతి ఫ్రెమ్ రిచ్ గా చూపించాడు .నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా అంధగాడు అందంతో పాటు అభినయం కలవాడు .

రేటింగ్ – 3 /5