జ్యోతి.. ఈనాడును మించుతోందా?

ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా లార్జెస్ట్ సెర్క్యులేష‌న్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్ప‌డు జ్యోతి రూపంలో చాప‌కింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బ‌కి మెత్త‌బ‌డి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే త‌న మానాన త‌ను ప‌ని కానిస్తోంది.

కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్ర‌జ్యోతి మాత్రం ఇటీవ‌ల కాలంలో భారీగా విస్త‌రించింద‌ని తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొన్ని ఎడ‌ష‌న్ల‌ను బ్లాక్ అండ్ వైట్‌తోనే నెట్టుకొచ్చిన జ్యోతి.. ఇప్పుడు స్టేట్ వైడ్‌గా అన్నీ క‌ల‌ర్ ఎడిష‌న్ల‌నే ఇస్తోంది. ముఖ్యంగా 2014 టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆంధ్ర‌జ్యోతి ఆర్థికంగా పుంజుకుంటోంద‌ని టాక్‌. దీనికి అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ.. వాటితో నిమిత్తం లేకుండా ఒక్క ఈనాడు, జ్యోతి విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఈ రెండు ప‌త్రిక‌లు ఎవ‌రి మానాన వాళ్లు న్యూస్ రాసుకుంటున్నాయి.

కానీ, ఇటీవ‌ల ఆర్కే మాత్రం జ్యోతిని సాధ్య‌మైనంత మేర‌కు విస్త‌రించాల‌ని, ఈ విష‌యంలో ఈనాడును సైతం అధిగ‌మించాల‌ని ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలిసింది. అందుకే ఆయ‌న సాక్షి స‌హా ఈనాడు లోని క్లిక్ అయిన విష‌యాల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా అనుస‌రిస్తున్నాడు. సాక్షిలో హిట్ అయిన ఫ్యామిలీ పేజీ మాదిరిగానే జ్యోతిలో న‌వ్య డెవ‌ల‌ప్‌మెంట్ కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. అదేస‌మ‌యంలో సండే మేగ‌జైన్ కూడా మొన్న‌టి వ‌ర‌కు న్యూస్‌ప్రింట్‌లో వ‌చ్చేది ఇప్పుడు మాత్రం ఈనాడు మాదిరిగా ఆర్ట్ పేప‌ర్ వినియోగిస్తున్నారు.

ఫ‌లితంగా ఈనాడు పాఠ‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ్యోతి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరుతోంది. ఇక‌, సాక్షి మాత్రం జ‌గ‌న్ వార్త‌ల కోస‌మే పుట్టిన‌ట్టుగా ఉంది. దీంతో ఆర్కే రానున్న రోజుల్లో మ‌రింత‌గా బ‌లం పుజుకున్నా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర‌లేదు. ఇక‌, ఈనాడు మాత్రం త‌న‌కు పోటీ వ‌చ్చేవారిని తుద‌కంట అణిచేయ‌డం తెలిసిందే. మ‌రి ఇప్పుడు జ్యోతి విష‌యంలో ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.