ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దెబ్బ‌తో ఆ హీరోయిన్ కెరీర్ స్మాష్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్ ఛాన్స్ వ‌స్తే ఆ హీరోయిన్ లైఫ్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయిపోతుంది. కానీ ప‌వ‌న్ ప‌క్క‌న ఆ హీరోయిన్‌కు ఛాన్స్ వ‌చ్చింది…అంతే ఆ హీరోయిన్ ఫేట్ మారిపోతుంద‌నుకున్నారు అంతా…అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ అడ్ర‌స్ ఎక్క‌డో కూడా తెలియ‌కుండా పోయింది. అనీషా అంబ్రోస్ .. ఇప్పటికీ మనకు పెద్దగా పరిచయం లేదు.

ప‌వ‌న్ స‌ర్దార్ సినిమాలో అనీషా అంబ్రోస్ హీరోయిన్‌గా ఎంపికైంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే ఆమె ఒక్క‌సారిగా స్టార్ అయిపోయింది. ఆ సినిమా కోసం సంప‌త్‌నందితో ఎలా క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేసింది అనీషా అంబ్రోస్. ఈ ప్రాజెక్టు నుంచి సంప‌త్‌ను త‌ప్పించి బాబిని తీసుకొచ్చిన ప‌వ‌న్‌…చివ‌ర‌కు అనీషాను తీసేసి కాజ‌ల్‌ను రీ ప్లేస్ చేశారు. దీంతో అనీషా కెరీర్ కాస్తా రివర్స్ అయ్యింది.

ప‌వ‌న్ కొట్టిన దెబ్బ‌తో అనీషాను ప‌ట్టించుకునే వాడే లేడు. మీడియం హీరోలు కాదు క‌దా క‌నీసం చిన్న హీరోలు కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వ‌లేదు. ప‌వ‌న్ కోసం ఎనిమిది నెల‌ల పాటు ఏ సినిమా కూడా ఒప్పుకోకుండా వెయిట్ చేసిన అనీషాకు ఆ త‌ర్వాత ఛాన్సులు ఎవ్వ‌రూ ఇవ్వలేదు. ఆమె కెరీర్ దారుణంగా దెబ్బ‌తింది. చాలా రోజుల‌కు ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ అనే సినిమా తన చేతికి చిక్కింది. మరీ ఈ సినిమా అయినా అమ్మడి జాతకాన్ని మార్చుతుందో లేదో చూడాలి.

AnishaAmbrose(1)