అనుష్క పెళ్లి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టనుందా!

May 22, 2017 at 6:40 am
Anushka Shetty

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా కోసం ఐదేళ్లుగా క‌ష్ట‌ప‌డిన వారికి పెద్ద రిలీఫ్ వ‌చ్చేసింది. ఈ పెళ్లి కోసం ఐదేళ్ల‌పాటు ఎన్నో కాల్షీట్లు ఇచ్చిన హీరో ప్ర‌భాస్‌తో పాటు హీరోయిన్ అనుష్క పెళ్లిల్ల‌పై ప్ర‌స్తుతం జోరుగా ఊహాగానాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తోన్న ప్ర‌భాస్ పెళ్లి ఈ యేడాదిలోనే ఉంటుంద‌ని ప్ర‌భాస్ పెద‌నాన్న‌, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌భాస్ పెళ్లి త్వ‌ర‌లోనే ఉండొచ్చు. ప్ర‌భాస్ సామాజిక‌ర్గానికే చెందిన భీమ‌వ‌రంకు చెందిన ఓ అమ్మాయితో ప్ర‌భాస్ పెళ్లి ఉంటుంద‌ని స‌మాచారం.

ఇక స్విటీబ్యూటీ అనుష్క పెళ్లికి ముహూర్తం పెట్ట‌డ‌మే త‌రువాయి అని… ఆమె పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా జ‌రిగిపోతున్నాయంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జోరందుకుంది. వాస్త‌వానికి అనుష్క పెళ్లిపై గ‌త యేడాదిన్న‌ర‌గా వార్త‌లు వ‌స్తున్నాయి. అనుష్క ప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుంటుంద‌ని ఓ సారి, ఓ ఏజ్‌బార్ నిర్మాత‌ను పెళ్లి చేసుకుంటుంద‌ని, నాగార్జున చూసిన ఓ వ‌రుడిని ఆమె పెళ్లాడుతుంద‌ని మ‌రోసారి ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌కు చెక్ పెట్టేందుకు ఏజ్ బార్ అవుతోన్న అనుష్క‌కు పెళ్లి చేసేయాల‌ని ఆమె త‌ల్లిదండ్రులు గ‌ట్టిగా డిసైడ్ అయ్యార‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆమె పెళ్లి ప‌నుల కోసం షాపింగ్ ప‌నులు బిజీగా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల అనుష్క‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు క‌ర్నాట‌క‌లోని కొల్లూరులోని ముకాంబిక ఆల‌యంలో సీక్రెట్‌గా పూజ‌లు చేశారు. ఈ పూజ‌లు అనుష్క పెళ్లి కోస‌మే అన్న టాక్ క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనుష్క పెళ్లిపై వ‌చ్చిన వార్త‌ల‌న్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు వ‌చ్చే వార్త‌లు మాత్రం సీరియ‌స్ అంటున్నారు. చూద్దాం మ‌రి ఈ సారైనా జేజ‌మ్మ ఓ ఇంటిది అవుతుందేమో..!

 

అనుష్క పెళ్లి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టనుందా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts