ఏపీ మంత్రుల్లో నెంబ‌ర్ 1 బ‌ద్ద‌క‌స్తుడు ఎవ‌రంటే…

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్ర‌బాబు వ‌య‌స్సు మంత్రుల‌తో పోల్చుకుంటే ఎక్కువే అయినా మంత్రుల క‌న్నా ఆయ‌నే బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇక మంత్రుల్లో చాలా మంది మ‌హాబ‌ద్ద‌క‌స్తులుగా మారిపోయారు. త‌మ శాఖ‌కు సంబంధించి వ‌చ్చిన ఫైళ్ల‌ను క్లియ‌ర్ చెయ్య‌డంలో వారు రోజులు కాదు వారాలు, నెల‌లు త‌ర‌బ‌డి టైం తీసుకుంటున్నారు. మంత్రులు ఫైళ్ల‌ను క్లియ‌ర్ చేయ‌డంలో ఎంతెంత టైం తీసుకుంటున్నార‌న్న ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త ప్ర‌కారం జీఏడీ రిపోర్టులు ఏం చెపుతున్నాయో చూద్దాం.

న‌వ్యాంధ్ర‌లో ప్ర‌భుత్వ పాల‌న‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించేందుకు చంద్ర‌బాబు క్ష‌ణం తీరిక లేకుండా ప‌ని చేస్తుంటారు. చంద్ర‌బాబు అంత కష్ట‌ప‌డుతున్నా మంత్రులు మాత్రం కీల‌కమైన నిర్ణ‌యాలు, ఫైళ్ల క్లీయ‌రెన్స్ విష‌యంలో మాత్రం రోజులు కాదు ఏకంగా నెల‌ల త‌ర‌బ‌డి టైం తీసుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది అనే అంశాలపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఇచ్చింది. 

ఈ లిస్టులో దేవాదాయ శాఖా మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు పేషీకి ఫైల్ వెళితే అది బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు క‌నీసం మూడు నెలలు ప‌డుతోంద‌ట‌. ఆయ‌న ఒక్కో ఫైల్ క్లియ‌రెన్స్ యావ‌రేజ్ టైం 77 రోజులుగా తేలింది. ఆయ‌న సిబ్బంది ఆయ‌న‌కు ఫైల్ విష‌యంలో స‌రైన గైడెన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు ఆయ‌న అల‌స‌త్వం కూడా ఇందుకు ఓ కార‌ణం కావ‌చ్చు. దీంతో ఫైళ్ల క్లియ‌రెన్స్ విష‌యంలో పైడికొండ‌ల బ‌ద్ధ‌క‌స్తుడు అన్న ముద్ర ఆయ‌న‌పై ప‌డిపోయింది. ఇక విశాఖ‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేషీకి వెళ్లిన ఫైల్ క్లియ‌ర్ అయ్యేందుకు 33 రోజుల టైం ప‌డుతోంది. ఫైళ్ల క్లియ‌రెన్స్ విష‌యంలో గంటా కూడా వెన‌క‌ప‌డే ఉన్నారు.

ఇక నిత్యం క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉండే చంద్ర‌బాబు పేషీకి వెళ్లిన ఫైల్ యావ‌రేజ్‌గా 20 రోజుల్లోనే క్లియ‌ర్ అవుతోంది. ఇక హోం మంత్రి చిన‌రాజ‌ప్ప మాత్రం ఈ విష‌యంలో గ్రేట్. ఆయ‌న చాలా స్పీడ్‌తో ఫైళ్లు క్లియ‌ర్ చేసేస్తున్నాడు. ఏడాది కాలంలో 364 ఫైళ్లను చిన రాజప్ప 3 రోజుల 22 గంటల 56 నిముషాల యావరేజ్ తో ముగించేశారు. ప్రస్తుత క్యాబినెట్లో అత్యంత వేగంగా ఫైళ్లు క్లియర్ చేసిన మంత్రిగా చిన రాజప్ప నిలిచారు. 

మంత్రుల‌ ఫైళ్లు యావరేజ్ టైం ఇలా ఉంది….

– సీఎం చంద్రబాబు:  5280 – 20 రోజుల 23 గంటల

– యనమల రామకృష్ణుడు:  1510 – 8 రోజుల 18 గంటల

– నారాయణ: 1268 –  11 రోజుల 15 గంటల

– కేఈ కృష్ణమూర్తి:  935 – 5 రోజుల 13 గంటలు

– దేవినేని  ఉమ: 740 – 5 రోజులు 18 గంటలు

– శిద్దా  రాఘవరావు: 626 – 17 రోజుల 14 గంటలు

– గంటా శ్రీనివాసరావు:  554 – 33 రోజులు

– అయ్యన్నపాత్రుడు:  517 – 5 రోజుల 22 గంటలు

– చిన రాజప్ప: 364 –  3 రోజుల 22 గంటలు

– అచ్చెన్నాయుడు: 352 – 8 రోజుల 16 గంటలు

– కొల్లు రవీంద్ర: 333 – 13 రోజుల 21 గంటలు

– కామినేని శ్రీనివాస్: 264 – 7 రోజులు

– పరిటాల సునీత: 61 – 16 రోజులు

– మాణిక్యాల రావు: 11 – 77 రోజుల 7 గంటలు