‘ అర్జున్‌రెడ్డి ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

September 2, 2017 at 10:15 am
Arjun Reddy

చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్‌రెడ్డి సినిమా బాక్సాఫీస్ సెన్షేష‌న‌ల్‌గా మారిపోయింది. ప్రీమియ‌ర్ షో నుంచే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసుకుంటూ పోతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసే సరికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అదిరిపోయే షేర్ రాబ‌ట్టింది. తొలి వారం అర్జున్‌రెడ్డి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 31 కోట్ల గ్రాస్.. రూ.17.15 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.

మూడు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా.. తర్వాతి నాలుగు రోజుల్లో ఆరు కోట్ల దాకా తెచ్చుకుంది. అమెరికాలో ఈ చిత్రం 1.3 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల దిశ‌గా దూసుకు వెళుతోంది. ఇక నిన్న రిలీజ్ అయిన బాల‌య్య పైసా వ‌సూల్ ఓవ‌ర్సీస్‌లో పెద్ద పెర్పామ్ చేసే సూచ‌న‌లు లేక‌పోవ‌డం కూడా ఈ సినిమాకు క‌లిసి రానుంది. ఇక ఈ సినిమా లాంగ్ రాన్‌లో రూ. 30 కోట్ల షేర్ రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

అర్జున్ రెడ్డి ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ డీటైల్స్ :

నైజాం – 6.1 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.05 కోట్లు

ఈస్ట్ – 81 లక్షలు

వెస్ట్ – 42 లక్షలు

కృష్ణా – 79 లక్షలు

గుంటూరు – 75 లక్షలు

నెల్లూరు – 28 లక్షలు

సీడెడ్ – 1.4 కోట్లు

————————————

ఏపీ+నైజాం షేర్ = 11.6 కోట్లు

————————————

ఏపీ+నైజాం గ్రాస్ = 19.3 కోట్లు

అమెరికా- 3.75 కోట్లు

కర్ణాటక – 1 కోటి

రెస్టాఫ్ ఇండియా -80 లక్షలు

—————————————–

వరల్డ్ వైడ్ షేర్ = 17.15 కోట్లు

—————————————–

వరల్డ్ వైడ్ గ్రాస్ = 31.1 కోట్లు

—————————————–

 

‘ అర్జున్‌రెడ్డి ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts