బ్లాక్ బస్ట‌ర్ ‘ అర్జున్‌రెడ్డి ‘…ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌

August 29, 2017 at 12:48 pm
Arjun Reddy

టాలీవుడ్‌లో ఇటీవ‌ల విడుద‌లైన ‘ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, ఆనందో బ్రహ్మ’ వంటి చిన్న సినిమాలు మంచి విజయాల్ని అందుకుని అదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తున్నాయి. పై సినిమాల స‌క్సెస్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమా అయితే చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోను అదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోన్న ఈ సినిమా ఓవర్సీస్‌లో అయితే కేవ‌లం నాలుగు రోజుల‌కే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరి పెద్ద హీరోల‌కు కూడా దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది. కొత్త దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ’ నటించిన ఈ సినిమా మొదట మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.15 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమాకు మొత్తం రూ. 3 కోట్ల లోపు బ‌డ్జెట్ అయితే లాంగ్ ర‌న్‌లో రూ.30 కోట్ల షేర్ రాబ‌డుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఈ లెక్క‌న పెట్టిన పెట్టుబ‌డితో పోలిస్తే ఈ సినిమాకు 10 రెట్ల‌కు పైగా లాభాలు రానున్నాయి.

ఏరియాల వారీగా అర్జున్‌రెడ్డి సినిమా 3 రోజుల‌ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి…

నైజాం – 3.58 కోట్లు

సీడెడ్ – 95 లక్షలు

నెల్లూరు – 18 లక్షలు

గుంటూరు – 45 లక్షలు

కృష్ణా – 55 లక్షలు

వెస్ట్ – 25 లక్షలు

ఈస్ట్ – 54 లక్షలు

వైజాగ్ – 65 లక్షలు

—————————-

టోట‌ల్ = 7. 15 కోట్లు

—————————-

 

బ్లాక్ బస్ట‌ర్ ‘ అర్జున్‌రెడ్డి ‘…ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts