‘ అర్జున్‌రెడ్డి ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

August 30, 2017 at 6:33 am
Arjun Reddy

చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచిన అర్జున్‌రెడ్డి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గ‌త‌ శుక్ర‌వారం రిలీజ్ అయిన అర్జున్‌రెడ్డి సినిమా వ‌సూళ్లు చూసి పెద్ద హీరోల‌కే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. మూడో రోజుల‌కే కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే 7.15 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా నాలుగో రోజు కూడా ఏపీ+తెలంగాణ‌లో ఏకంగా 1.50 కోట్ల షేర్ సాధించింది.

నాలుగు రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ 8.50 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో అయితే 4 రోజుల‌కు ఏకంగా 4.50 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక ఓవర్సీస్‌లో ప్రీమియ‌ర్ల‌తోనే వ‌సూళ్ల వేట ప్రారంభించిన అర్జున్‌రెడ్డి ఫ‌స్ట్ వీకెండ్‌కే మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేసి పెద్ద హీరోల సినిమాల‌కు సైతం సాధ్యం కాని రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.

ఫ‌స్ట్ వీక్ 7 రోజుల‌కు ఏపీ, తెలంగాణ‌లో అర్జున్‌రెడ్డి రూ.12 కోట్ల షేర్ సాధించ‌డంతో పాటు ఓవ‌రాల్‌గా రూ. 30 కోట్ల మార్క్ ట‌చ్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఓవ‌ర్సీస్‌లో లాంగ్ ర‌న్‌లో అర్జున్‌రెడ్డి 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ టచ్ చేయ‌నుంద‌ని టాక్‌. ఈ సినిమా వ‌సూళ్ల‌తో పెద్ద హీరోలు సైతం షాక్ అయిపోతున్నారు. పెట్టుబడితో పోల్చుకుంటే ఏకంగా 10 రెట్ల వ‌ర‌కు అర్జున్‌రెడ్డి భారీ లాభాలు మూట‌క‌ట్టుకోనుంది.

 

‘ అర్జున్‌రెడ్డి ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts