‘ అర్జున్‌రెడ్డి ‘ హీరోయిన్ గురించి బ‌య‌ట‌ప‌డిన ర‌హ‌స్యం ఇదే…

August 31, 2017 at 9:56 am
Arjun reddy, Movie, shalini

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న సినిమా అర్జున్‌రెడ్డి. చిన్న సినిమాగా కేవ‌లం రూ. 3 కోట్ల లోపు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో వ‌సూళ్ల‌తో పాటు ఓవ‌ర్సీస్ వ‌సూళ్లు, శాటిలైట్ రైట్స్‌, డిజిట‌ల్ రైట్స్‌, రీమేక్ హ‌క్కులు క‌లుపుకుని ఓవ‌రాల్‌గా రూ. 50 కోట్ల బిజినెస్ చేస్తుంద‌ని అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎవ్వ‌రి నోట విన్నా అర్జున్‌రెడ్డి గురించే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో న‌టించిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ షాలిని పాండే, ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ సినిమా హిట్ అయిన ఉత్సాహంతో ఉన్న హీరోయిన్ షాలిని పాండేకు ప‌లు క్రేజీ ప్రాజెక్టుల నుంచి మంచి ఆఫర్లు వ‌స్తున్నాయి.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో షాలిని పాండే త‌న గురించి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. ఆమె మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో పుట్టింది. ఆమె తండ్రి ప్ర‌భుత్వ ఉద్యోగి. చిన్న‌ప్ప‌టి నుంచే చ‌దువులో టాపర్ అయిన షాలిని చిన్న‌ప్ప‌టి నుంచే హీరోయిన్ కావాల‌న్న ఆశ‌తో ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించి థియేట‌ర్ ఆర్ట్స్‌లో చేరింది.

ఇంజ‌నీరింగ్ కంప్లీట్ అయ్యాక ఉద్యోగం చేయ‌మ‌న్న త‌న తండ్రి మాట‌ను భేఖాతార్ చేసిన ఆమె సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేసింద‌ట‌. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న ఆమె తండ్రి షాలినిపై ఫైర్ అవ్వ‌గా ఏకంగా తండ్రిపైనే పోలీసు కేసు పెడ‌తాన‌ని బెదిరించింద‌ట‌. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు షాలినితో మాట్లాడ‌డం మానేశార‌ట‌.

చివ‌ర‌కు ఎలాగోలా ముంబై చెక్కేసి అక్క‌డ ఫ్రెండ్స్ ద్వారా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి చివ‌ర‌కు అర్జున్‌రెడ్డి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఆడిషన్ సమయంలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని దర్శకుడు సందీప్ తనకు చెప్పలేదని ఒకవేళ అప్పుడు చెప్పి ఉంటే ఈ సినిమా చేసి ఉండ‌క‌పోవ‌చ్చేమోన‌ని షాలిని అంటోంది. ఇక ఈ సినిమాలో ముద్దుసీన్లు త‌న‌ను ఎంతో భ‌య‌పెట్టాయోన‌ని వాటిని ఆమె గుర్తు చేసుకుంది.

Arjun-Reddy-Heroine-Shalini-Pandey-Latest-Hot-Photos-1 Arjun-Reddy-Heroine-Shalini-Pandey-Latest-Hot-Photos-4 Arjun-Reddy-Heroine-Shalini-Pandey-Latest-Hot-Photos-16 Arjun-Reddy-Heroine-Shalini-Pandey-Latest-Hot-Photos-23

 

‘ అర్జున్‌రెడ్డి ‘ హీరోయిన్ గురించి బ‌య‌ట‌ప‌డిన ర‌హ‌స్యం ఇదే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts