అర్జున్‌రెడ్డి TJ రివ్యూ

రివ్యూ: అర్జున్‌రెడ్డి

నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే

మ్యూజిక్‌: రాధ‌న్‌

నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగ

దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగ

సెన్సార్ రిపోర్ట్‌: ఏ

ర‌న్ టైం: 187 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 25 ఆగ‌స్టు, 2017

టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్‌రెడ్డి. పెళ్లిచూపులు సినిమాతో పాపుల‌ర్ హీరోగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని జంటగా న‌టించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే కావాల్సిన‌న్ని కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేసుకుంది. 187 నిమిషాల ర‌న్ టైం కావ‌డం కూడా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఎన్నడూ లేనంతగా ప్రీమియర్ లు కూడా ప్లాన్ చేసారు ఒక చిన్న సినిమా కోసం. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

కథ – పాజిటివ్‌లు :

అర్జున్ రెడ్డి .. ట్రైలర్ లో చెప్పినట్టు గానే హౌస్ సర్జన్ గా చదువుకుంటూ ఉంటాడు .. విపరీతమైన పొగరు , కోపం , యాటిట్యూడ్ ఉన్న రెడ్డి కాలేజీ గొడవల్లో పడి కాలేజీ వదిలెయ్యాలి అనుకుంటున్న టైం లో ప్రీతీ జూనియర్ గా జాయిన్ అవడం ఆమెని చూసిన తొలి చూపు లోనే ఇతగాడు ప్రేమలో పడ్డం జరుగుతుంది. అలా సాగిన వారి ప్రేమ కథ పెళ్లి దగ్గరకి వచ్చే సరికి కులం కారణంగా ఆగిపోతుంది. అనుకోని పరిస్థితి లో అర్జున్ రెడ్డి లవర్ ప్రీతీ పెళ్లి మరొక వ్యక్తి తో జరిగిపోతుంది. బ్రేక్ అప్ అనే అగాధం లో పడిపోయిన అర్జున్ రెడ్డి ప్రీతీ ని మరచిపోలేక ఏం చేశాడు, చివరికి అతను ఎంతగా దిగజారిపోయాడు. అతను ఆఖరికి బతికే ఉన్నాడా లేడా అనేదే ఈ స్టోరీ.

అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ గా విజయ్ దేవరకొండ నటన అతని కెరీర్ లో చెప్పుకునే విధంగా నిలిచిపోతుంది . ఇతని క్యారెక్టర్ , దాన్ని డైరెక్టర్ మలచిన తీరు , దానికి విజయ్ ఇచ్చిన ఫుల్ లెంత్ నటన ఈ చిత్రానికే హైలైట్లు గా నిలిచాయి. హీరోయిన్ శాలిని ఆమె పరిథి లో బాగానే చేసింది. హీరో ఫ్రెండ్ శివ క్యారెక్టర్ కామెడీ తో పాటు చాలా సినిమాని హీరోతో పాటు క్యారీ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్.

కాలేజీ రోజులు, ర్యాగింగ్ , గొడవలు , హీరో కోపం, హీరోయిన్ మీద ప్రేమ ఇలా అన్ని రకాలుగా డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు. పాటలు కూడా తెరమీద బాగానే వర్క్ అయ్యాయి. లిప్ కిస్ సీన్ లూ , బోల్డ్ డైలాగులు , బూతులు ఇవన్నీ యూత్ కి ఫుల్ ట్రీట్ లాగా అనిపిస్తాయి. క్లిమాక్స్ ట్విస్ట్ అతిపెద్ద పాయింట్. ఆ పాయింట్ మీదనే సెకండ్ హాఫ్ నిలవగాలిగింది. ఇక హీరో, హీరోయిన్ క‌లిస్తే చాలు అత‌డు ఆమెకు ముద్దులు పెడుతూనే ఉంటాడు. ఇవ‌న్నీ యూత్‌కు మాంచి కిక్ ఇస్తాయి.

నెగెటివ్: ఫస్ట్ హాఫ్ ఫుల్ పేస్ లో సాగిన సినిమా సెకండ్ హాఫ్ లో చాలా మటుకు డల్ గా నడిచింది. ముఖ్యంగా ఆఖరి ముప్పై నిమిషాలు సినిమా చాలా స్లో ఐపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ లేకపోతే సెకండ్ హాఫ్ కి ఫుల్ వీక్ టాక్ వచ్చి సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేది. లిప్ కిస్ సీన్ లూ , బోల్డ్ డైలాగులు , బూతులు ఇవన్నీయూత్ కి ఎంత పాజిటివ్ లో ఫామిలీ లు థియేటర్ లకి ఆమడు దూరం లో ఉండేలా చేస్తాయి . డ్రాగ్ విషయం లో కూడా డైరెక్టర్ కాస్త దృష్టి పెట్టాల్సింది. ఒకే పాయింట్ చెప్పడం కోసం మూడు గంటలు తినేసాడు అనే అపవాదు కూడా వినిపిస్తోంది. మ‌రో మైన‌స్ ఏంటంటే ద‌ర్శ‌కుడు కేవలం ఏ సెంట‌ర్ ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా కావ‌డంతో బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాదు.

ఫైన‌ల్‌గా…

మొత్తం మీద చూస్తే సూపర్బ్ అనిపించే ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ అయితే .. డ్రాగ్ ఉండడం సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రేంజ్ లో లేకపోవడం నెగెటివ్ లు .. భగ్న ప్రేమికులు ఈ సినిమాతో విపరీతంగా కనక్ట్ అవుతారు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. జీవితం లో ఒక్కసారైనా ప్రేమ యొక్క అనుభూతి ని పొందిన వాళ్ళు ఈ సినిమాని మనస్పూర్తిగా మెచ్చుకుంటారు. ట్రెండ్ సెట్టర్ గా కూడా ఈ సినిమాని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి బోల్డ్ కథ తో పచ్చి కథనం తో సాగిన అర్జున్ రెడ్డి తెలుగు సినిమాలో కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉంది . రెవెన్యూ పరంగా సూపర్ హిట్ రాసుకోవచ్చు.

TJ ఫైన‌ల్ పంచ్‌: ఈ త‌రం మినీ దేవ‌దాసు ఈ అర్జున్ రెడ్డి

TJ అర్జున్‌రెడ్డి మూవీ రేటింగ్‌: 3 / 5