బాహుబలి క్రేజ్ మరింత

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. ఈ సినిమా భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమెరికా, దుబాయ్‌, సౌదీ అరేబియా, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల‌లో స‌త్తా చాటుతోంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే లెక్క‌కు మిక్కిలిగా ఎన్నో రికార్డులు త‌న అక్కౌంట్‌లో వేసుకుంది.

ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 సినిమాను ఇప్పుడు మ‌రో రెండు భాష‌ల్లోకి డ‌బ్ చేస్తున్నారు. బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్‌కు చైనాలో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2ను చైనా భాష‌లోకి డ‌బ్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు జ‌పాన్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ క్ర‌మంలోనే జ‌పాన్‌లో సైతం బాహుబ‌లి 2 రిలీజ్ కానుంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌కు ద‌గ్గ‌ర‌వుతోన్న ఈ సినిమా వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేరి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్ రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరే సినిమాగా రికార్డుల‌కు ఎక్కుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.