పాకిస్థాన్‌లో ” బాహుబ‌లి 2 ” దూకుడు

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్ రూ. 1500 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇండియాలో సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 మ‌న దాయాది దేశ‌మైన పాకిస్థాన్‌లోను వ‌సూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. వాస్త‌వానికి బాహుబ‌లి 2 రిలీజ్‌కు ముందు ఈ సినిమా హిందూ క‌ల్చ‌ర్‌ను ఎలివేట్ చేసే సినిమా అని…ఈ సినిమాకు పాకిస్థాన్‌లో సెన్సార్ స‌ర్టిఫికెట్ రావ‌డం క‌ష్ట‌మ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఈ అనుమానాల‌కు చెక్‌పెడుతూ బాహుబ‌లి 2కు పాకిస్థాన్ సెన్సార్ బోర్డు స‌ర్టిఫికెట్ జారీ చేసింది. బాహుబ‌లి 2 పాకిస్థాన్‌లో రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వందకు పైగా థియేటర్లలో రిలీజైన బాహుబలి-2 ఇప్పటిదాకా అక్కడ ఈ చిత్రం రూ.4.5 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం విశేషం.

పాకిస్థాన్ అంటే ఖాన్ త్ర‌యం సినిమాలు మాత్ర‌మే బాగా ఆడ‌తాయి. అయితే బాహుబ‌లి 2 ఏకంగా అక్క‌డ ఈ రేంజ్‌లో వ‌సూళ్లు సాధించ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఫుల్ రన్లో ఈ సినిమా అక్కడ రూ.6 కోట్ల దాకా వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా బాహుబ‌లి 2 హ‌వా దాయాది దేశంలో కూడా జోరుగా కొన‌సాగుతోండ‌డం విశేషం.