బాహుబ‌లి తెలుగు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ అంచ‌నా..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త నెల 28న రిలీజ్ అయిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ నిమిషానికో రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన ఈ అపురూప దృశ్య‌కావ్యం ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోన్న అన్ని థియేట‌ర్ల‌లోను 95 శాతం అక్యుపెన్సీతో న‌డుస్తోంది.

తొలి 5 రోజుల‌కే రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టిన బాహుబ‌లి 2 6 రోజుల‌కు ఏపీ+తెలంగాణ‌లో క‌లుపుకుని రూ.109 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఆరు రోజుల‌కు ఏరియాల వారీగా చూస్తే…

నైజాంలో – 32.09 కోట్లు

సీడెడ్ – 19.05 కోట్లు

గుంటూరు – 11.44 కోట్లు

కృష్ణా – 7.87 కోట్లు

వెస్ట్ – 9.01 కోట్లు

ఈస్ట్ – 11.45 కోట్లు

ఉత్తరాంధ్ర – 14. 05 కోట్లు

———————————————-

ఏపీ+తెలంగాణ = 109.29 కోట్లు

———————————————–

లాంగ్ ర‌న్‌లో టార్గెట్ ఎంత‌..!

కేవ‌లం ఆరు రోజుల‌కే రూ.109 కోట్ల షేర్ రాబ‌ట్టిన బాహుబ‌లి 2 కేవ‌లం ఏపీ, తెలంగాణ వ‌ర‌కు చూసుకుంటే లాంగ్ ర‌న్‌లో ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న‌దానిపై ట్రేడ్ వ‌ర్గాలు ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ఓవ‌రాల్‌గా బాహుబ‌లి 2 లాంగ్ ర‌న్ ముగిసే టైంకు సులువుగా రూ.150-160 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.