బాహుబలి భామ చెంప దెబ్బకు కారణం లేకపోలేదా!

సినిమాలకు ప‌బ్లిసిటీ ఎంతో ముఖ్యం! స‌రైన ప‌బ్లిసిటీ లేకుంటే ఎంత పెద్ద సినిమా అయినా ఫ‌ట్ అనాల్సిందే! అయితే ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం.. ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ముందుగానే సెట్స్‌లో న‌టీన‌టుల‌తో ఉన్న వీడియోల‌ను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి వీడియో క్లిప్ వైర‌ల్‌గా మారింది. బాహుబ‌లి మొద‌టి భాగంలో `మ‌నోహ‌రీ..` పాట‌లో అంద‌చందాలు ఆరబోసిన న‌టి.. స్కార్లెట్ మిలిష్ విల్స‌న్ త‌న కో ఆర్టిస్టు చెంప చెళ్లుమ‌నిపించ‌డం.. వెంట‌నే ఆ న‌టుడిని బ‌య‌ట‌కు గెంటేయ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. అయితే ఇది ప‌క్కా ప‌బ్లిసిటీ స్టంట్ అని దానిని నిశితంగా ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది.

త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వర్తించాడ‌ని ఐటెం సాంగ్స్ తో పాపులరైన స్కార్లెట్ మెలిష్ విల్సన్ ఒకతని చెంపను సెట్స్ మీద చెళ్ళుమని అనిపించిందనే వార్త వైర‌ల్ అయిపోయింది. అతన్ని ఆ సెట్ నుండి బయటకు తోసిపాడేశారని.. అతనిపై కంప్లయిట్ కూడా ఫైల్ చేశారని తెగ వినిపించింది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అందుకే కేవలం చెంపపై ఆర్టిఫీషియల్ గా అమ్మడు కొడుతున్న సీన్.. ఆ తరువాత అతను సెట్ నుండి బయటకు వెళ్తున్న సీన్ ఉన్నాయి. కానీ వీడియోని నిశితంగా ప‌రిశీలిస్తే ఇదంతా ప్రీప్లాన్‌గా తీసింద‌ని అనిపించ‌క మాన‌దు.

నిజానికి ఒక సాంగులో భాగంగా స్కార్లెట్ జుట్టును ఈ నటుడు పక్కకు తీస్తున్నప్పుడు.. ఆమె కొడుతుంది. అది పక్కా యాక్టింగ్ అని అక్కడ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆ కొట్టే స‌మ‌యానికి చుట్టపక్కల ఉన్న డ్యాన్సర్లు కూడా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కొట్టేశాక స్కార్లెట్ మాత్రం.. ఏమీ తెలియ‌న‌ట్లు.. సరిపోద్దా ఇంకో టేక్ చేద్దామా అన్నట్లు రెడీగా ఉంది. ఇంత‌లో సూటేసుకున్న ఒక వ్యక్తి వచ్చి సదరు ఉమాకాంత్ అనే నటుడితో గొడవపెట్టుకుని ఏదో వాగ్వాదం చేస్తున్నాడు. ఉమాకాంత్ అక్కడ నుండి బయటకు వెళిపోతుంటే.. అతన్ని బతిమిలాలి మళ్లీ సెట్లోకి తీసుకొచ్చారు.

కట్ చేస్తే న్యూసులో మాత్రం.. అబ్బే ఉమాకాంత్ ను సెట్ నుండి మెడపట్టుకుని గెంటేశారు అని చెబుతున్నారు. మొత్తంగా వీడియో చూస్తే మీకేం అర్దమైంది? చక్కగా ఈ సినిమా యునిట్ ముందుగానే ప్లాన్ వేసి.. అందరూ ఎలా నటించాలో చెప్పి.. దానిని వీడియో తీయించి.. ఈ మొత్తం వీడియో వైరల్ అయ్యేలా చేసిన‌ట్లు అనిపించ‌క మాన‌దు! మ‌రి ప‌బ్లిసిటీ కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారిపోయి.. వైర‌ల్ చేయ‌డం ఎందుకు అనేది నెటిజ‌న్ల‌ ప్ర‌శ్న‌!!