బాహుబలిని తాకిన జాత్యాహంకారం

యావత్ భారత దేశం గర్వించ దగ్గ సినిమా బాహుబలి ది బిగినింగ్ కాగా..మొత్తం ఇండియన్ సినిమాకే తలమానికం బాహుబలి ది కంక్లూషన్ అన్నది విమర్శకుల నుండి సామాన్య ప్రేక్షకుడి దాకా అంచనా.ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఒక ఎత్తు బాహుబలి తరువాత ఒక ఎత్తు.చరిత్ర గురించి ఏదైనా మాట్లాడాలంటే  క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు ఎలా వేరు చేసి మాట్లాడుతామో అదే విధంగా ఇండియన్ సినిమా గురించి భావి తరాలు మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి తరువాత అని మాట్లాడుకోవలనడం అతిశయోక్తి కాదేమో.

ఈ బాహుబలి 2 వ భాగానికి వున్నా బజ్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ భాషా చిత్రానికి రాలేదు బహుశా ఇక రాదు కూడా ఏమో.అయితే ఇక్కడో ఆసక్తి కర విషయం అటు నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్స్ ని కాస్త ఇబ్బందికి గురి చేస్తోంది.బాహుబలి అడ్వాన్స్ బుకింగ్ సౌత్ లో హాట్ కేక్ లాగా అమ్ముడవగా నార్త్ లో మాత్రం టికెట్స్ దాదాపు 80 % ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

దీనిపై ఇంకో వాదన కూడా వినిపిస్తోంది.కావాలనే బాలీవుడ్ లో ఓ వర్గం బాహుబలి సినిమాకి బజ్ తగ్గించే పనిలో ఉందట.ఓ ప్రాంతీయ భాష చిత్రం అందులోను తెలుగు చిత్రాన్నికి బాలీవుడ్ సినిమాలు కూడా కని వినీ ఎరుగని క్రేజ్ రావడం కొందరు బాలీవుడ్ పెద్దలకు గిట్టడం లేదు.అందుకే పనిగట్టుకుని తమ ప్రాబల్యాన్న్తా వుపయోగించి బాహుబలి బజ్ ని తగ్గించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.

ఊదేస్తే ఆరిపోవడానికి అల్లాటప్పాగా గల్లీల్లో సిల్లీగా రిలీజ్ అయ్యే సొల్లు సినిమా కాదు ఇది.ఇది ఒక చరిత్ర.ఆపటం ఎవ్వరి తరమూ కాదు.ప్రేక్షకుడు నరం నాడి పట్టుకుని ఓ ఐదేళ్లపాటు ఓ తెలుగోడు కఠోర తపస్సుకు ప్రతిఫలమే ఈ బాహుబలి.ప్రాంతీయ వివక్షలు  బాహుబలి ముందు బలాదూర్ అవడం ఖాయం.రాసి పెట్టుకోండి ఇన్నాళ్ళనుండి ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క..తెలుగోడొచ్చాడు..తెలుగోడొచ్చాడు.తస్మాత్ జాగ్రత్త.