బాల‌య్య 102కు ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా కుర్రాళ్ల‌తో పోటీప‌డుతూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది సంక్రాంతికి త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టిన బాల‌య్య తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి త‌క్కువ టైంలోనే పైసా వ‌సూల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పైసా వ‌సూల్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంట‌నే బాల‌య్య త‌న 102 సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు.

కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న సినిమాలో బాల‌య్య న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ ఇటీవ‌లే కుంభకోణంలో ఫినిష్ అయ్యింది. బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తోన్న ఈ సినిమాలో ఓ రోల్ ప‌క్క‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బాల‌య్య‌-న‌య‌న‌తార కాంబినేష‌న్‌కు మంచి హిట్ ఫెయిర్ అన్న పేరుంది. ఇక ఈ సినిమాకు సీనియ‌ర్ ఎన్టీఆర్ హిట్ మూవీని టైటిల్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బాలయ్య 102గా వ‌స్తోన్న ఈ సినిమాకు ”కర్ణ” అనే పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఇదే టైటిల్‌తో చారిత్ర‌క సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రి తండ్రికి క‌లిసొచ్చిన ఈ టైటిల్ బాల‌య్య‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ? చూడాలి.