‘ ఎన్టీఆర్ బ‌యోపిక్ ‘  రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అప్పుడే షాకింగ్ ఎనౌన్స్‌మెంట్ చేశాడు. టాలీవుడ్‌లోను, తెలుగు రాజ‌కీయాల్లోను ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనే జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్ పొలిటిక‌ల్ యాంగిల్లోను, సినిమాల్లోను ఎలా హీరో అయ్యాడ‌న్న‌దానిపైనే బాల‌య్య – తేజ బ‌యోపిక్ వ‌స్తోంది. ఇక వ‌ర్మ మాత్రం ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చాక జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, 1994 ఎన్నిక‌ల్లో గెలుపు, చివ‌ర‌కు పార్టీలో సంక్షోభం లాంటి అంశాల‌తో ఆయ‌న సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బాల‌య్య – తేజ కాంబోలో వ‌స్తోన్న బ‌యోపిక్ రిలీజ్ డేట్‌ను అప్పుడే బాల‌య్య స్వ‌యంగా ఎనౌన్స్ చేసేశారు. వ‌చ్చే యేడాది మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పారు. త‌న తాజా ఇంట‌ర్వ్యూలో బాల‌య్య ఈ ప్ర‌క‌ట‌న చేశారో ? లేదో ? న‌ంద‌మూరి అభిమానుల్లో అప్పుడే ఎక్క‌డా లేని జోష్ వ‌చ్చేసింది. వ‌చ్చే యేడాది సంక్రాంతికి బాల‌య్య ప్ర‌స్తుతం కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న క‌ర్ణ సినిమా వ‌స్తుండ‌గా ఆ వెంట‌నే స‌మ్మ‌ర్‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అయిపోనుంది.

ద‌ర్శ‌కుడు తేజ ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్‌కు సంబంధించిన స్క్రిఫ్ట్ వ‌ర్క్ చేస్తున్నాడు. బాల‌య్య ప్ర‌స్తుతం చేస్తోన్న క‌ర్ణ షూటింగ్ ముగిసిన వెంట‌నే ఈ సినిమా షూటింగ్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఈ సినిమాను హీరో బాలకృష్ణతో సహా సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శ‌కుడిగా కీర‌వాణి ఎంపిక‌య్యారు. మిగిలిన సాంకేతిక నిపుణులు, కాస్టింగ్ ఎంపిక జ‌రుగుతోంది.