అమితాబ్‌, చిరుపై బాల‌య్య వ్యాఖ్య‌ల వెన‌క ప‌ర‌మార్థం ఇదేనా..!

‘‘ రాజకీయాల్లో రాణించడం ఒక్క రామారావుగారి వల్లే సాధ్యమయింది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు.. ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఒక్క గొప్ప పొలిటీషియన్‌ను ఓడించడం తప్ప. ఉత్తర ప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంటుకు వెళ్లాడు. పార్లమెంటులో ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు ? అంతెందుకు ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది ? రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఎవరివల్లా కాదు. కావాలంటే నేను రాసిస్తాను. నేను సలహా ఇస్తున్నా.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి రావొద్దు ’’

ఇది పైసా వ‌సూల్ ప్రమోష‌న్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు. బాల‌య్యది ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేసే మ‌న‌స్త‌త్వం. తాను ఏం చెప్పాల‌నుకున్నాడో కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తాడు. బాల‌య్య ఇంత‌లా ఎందుకు మాట్లాడాన్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు ఎవ‌రికి వారు ఊహించేసుకుంటున్నారు. బాల‌య్య రైతు సినిమా (కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కాల్సిన సినిమా ఆగిపోయింది)లో చిన్న రోల్ పోషించేందుకు అమితాబ్ నో చెప్ప‌డంతో బాల‌య్య ఇలా అన్నార‌ని కొంద‌రు అనుకుంటున్నారు.

స‌రే ఎవ‌రేమ‌నుకున్నా నిజంగానే అమితాబ్‌కు బాల‌య్య సినిమాలో రెండు నిమిషాల రోల్‌లో క‌నిపించే తీరిక లేద‌నుకుందాం. మ‌రి మ‌నం సినిమాలో అమితాబ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. ఇక ఇప్పుడు చిరు సైరా సినిమాలో ఏకంగా ఓ పెద్ద రోలే చేస్తున్నాడు. ఇక రెమ్యున‌రేష‌న్ అన్న‌ది ఎవ‌రికి అయినా పెద్ద లెక్క‌లోనిది కాదు…పైగా అమితాబ్ చేసేది చిన్న పాత్రే అవుతుంది.

మ‌రి చిరు, నాగార్జున సినిమాల‌కు గెస్ట్ రోల్ చేసిన అమితాబ్ బాల‌య్య సినిమాకు నో చెప్ప‌డం వెన‌క ఆంత‌ర్యం ఏంట‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాకమాన‌దు. పోని అమితాబ్ అంత తీరిక లేకుండా హిట్ సినిమాలు చేస్తున్నాడా ? అంటే ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌ని, ట్వీట్లు చేసుకోవ‌డానికి త‌ప్ప డైరెక్ష‌న్ మ‌ర‌చిపోయాడని జ‌నాలు సెటైర్లు వేసుకునే రాంగోపాల్‌వ‌ర్మ‌తో స‌ర్కార్‌-3 సినిమా చేశాడు. ఆ సినిమా రిజ‌ల్ట్ ఏం అయ్యిందో అంద‌రికి తెలిసిందే.

బాల‌య్యకు ఈ విష‌యాల‌న్ని ఆలోచించేంత తీరిక ఉన్నా లేక‌పోయినా వాళ్లిద్దరి గురించి రాజ‌కీయంగా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేశాడా ? అన్న కోణంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అక్క‌డ అమితాబ్‌, ఇక్క‌డ చిరు ఇద్ద‌రూ పొలిటిక‌ల్ తెర‌పై ప్లాప్ అయ్యారు. బాల‌య్య హిందూపురం ఎమ్మెల్యేగా ఆహా ఓహో అనిపించ‌క‌పోయినా అంత ప్లాప్ అయితే కాలేదు