బాలయ్య ‘పైసా వసూల్’లో హైలెట్ అదేనట

బాల‌య్య 101వ సినిమా పైసా వ‌సూల్ రేపు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. బాల‌య్య చివ‌రి చిత్రం, 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. ఇక బాల‌య్య – పూరీ జ‌గ‌న్నాథ్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో డిఫ‌రెంట్ అంచ‌నాలు ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే వీరి కాంబోలో వ‌స్తోన్న పైసా వ‌సూల్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో కనిపించిన కొత్త బాలకృష్ణ సినిమాలో ఎలా ఉంటాడో చూడాలనే కుతూహలం అందరిలోనూ ఉంది. అందుకే పైసా వ‌సూల్ కోసం కేవ‌లం నంద‌మూరి, బాల‌య్య అభిమానులే కాక, టోట‌ల్ టాలీవుడ్ సినీజనాలంద‌రూ ఆస‌క్తితోనే ఉన్నారు.

ఇక పైసా వ‌సూల్‌లో బాల‌య్య ల‌వ్ ట్రాక్ చాలా ఆస‌క్తిగా ఉంటుంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ మెచ్యూర్డ్ ల‌వ్‌స్టోరీ కొత్త‌గా ఉండ‌డంతో పాటు మంచి వినోదాన్ని ఇస్తుంద‌ట‌. శ్రేయ‌ను బాల‌య్య ఆట‌ప‌ట్టించే విధానం, ఆమె బాల‌య్య‌తో ల‌వ్‌లో ప‌డ‌డం ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని వినోదంగాను, సినిమాకు మేజ‌ర్ హైలెట్‌గాను నిలుస్తుంద‌ట‌.

ఇక ఇప్పటికే బాలకృష్ణతో రెండు సినిమాల్లో కలిసి నటించిన బాలకృష్ణ , శ్రియలకు ఇది మూడో సినిమా కావడం విశేషం. మ‌రి ఈ క‌మ‌ర్షియ‌ల్ మూవీలో వీరి కెమిస్ట్రీ ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అయ్యిందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే. భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

తెలుగు జర్నలిస్ట్  లో  రేపు ఉదయం 6 గంటలకే “పైసా వసూల్’ రివ్యూ సిద్ధంగా ఉండండి…