సూప‌ర్ హిట్ సినిమా సీక్వెల్‌కు బాల‌య్య రెడీ..!

నంద‌మూరి అందగాడు యువ‌ర‌త్న బాల‌కృష్ణ ఈ యేడాది ఇప్ప‌టికే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసా వ‌సూల్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కుర్రాళ్లతో పోటీప‌డుతూ సినిమాలు చేస్తోన్న బాల‌య్య తాజాగా 102వ సినిమాలో న‌టిస్తున్నాడు. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వికుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ త‌మిళ‌నాడులోని కుంభ‌కోణంలో జ‌రుపుకుంటోంది.

త‌న 102వ సినిమా షూటింగ్‌లో ఉండ‌గానే బాల‌య్య 103, 104 సినిమాల‌ను కూడా ఫైన‌ల్ చేసేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా త‌న‌కు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చిన బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఉండనుంది. బోయ‌పాటి ప్రాజెక్టుల‌ను బ‌ట్టి ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీద‌కు వెళ్లేది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

ఇక బాల‌య్య మ‌రో క్రేజీ ప్రాజెక్టులో న‌టించేందుకు రెడీగా ఉన్నాడు. గ‌తంలో త‌మిళ్‌లో విక్ర‌మ్ – హ‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చి సూప‌ర్ హిట్ అయిన సామిని తెలుగులో ల‌క్ష్మీ న‌ర‌సింహా పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. 14 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ హిట్ సినిమాకు త‌మిళ్‌లో అదే విక్ర‌మ్ – హ‌రి కాంబోలో సామికి సీక్వెల్‌గా సామి-2 వ‌స్తోంది.

ఇప్పుడు ఈ సీక్వెల్ క‌థ అదిరిపోయేలా ఉండడంతో ఇందులో న‌టించాల‌ని బాల‌య్య ఉత్సాహంగా ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అక్క‌డ సామి-2 షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాల‌య్య – కేఎస్.ర‌వికుమార్ సినిమా కంప్లీట్ చేసిన వెంట‌నే ఆ సినిమాను సెట్స్‌మీద‌కు తీసుకువెళ‌తాడా ? లేదా ? బోయ‌పాటి సినిమా త‌ర్వాత సామి-2 లో న‌టిస్తాడా ? అన్న‌ది చూడాలి.