‘ పైసా వ‌సూల్ ‘ లెక్క ఎన్ని కోట్లో తెలుసా

బాల‌య్య సినిమాలను క‌మ‌ర్షియ‌ల్‌గా చూస్తే శాత‌క‌ర్ణి ముందు వ‌ర‌కు ఒక ఎత్తు. శాత‌క‌ర్ణి త‌ర్వాత ఒక ఎత్తు. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన హిస్టారిక‌ల్ మూవీ శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని వసూళ్లు సాధించింది. శాత‌క‌ర్ణి ఓవ‌రాల్‌గా రూ. 77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య రేంజ్ బాగా పెరిగిపోయింది. బాల‌య్య సినిమాల బ‌డ్జెట్‌తో పాటు బిజినెస్ కూడా పెరిగింది. బాల‌య్య – పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న పైసా వ‌సూల్ సినిమా బడ్జెట్ కూడా 46 కోట్లు దాటేసింది. పూరీ అంటే లో బ‌డ్జెట్‌లోనే సినిమాలు ఫినిష్ చేస్తాడ‌న్న టాక్ ఉంది.

అయితే పైసా వ‌సూల్ సినిమాను సాంకేతికంగా బాగా రిచ్‌గా తెర‌కెక్కించ‌డం, విదేశాల్లో ఎక్కువ భాగం షూట్ చేయ‌డంతో బ‌డ్జెట్ అనుకున్న‌దానికంటే కాస్త ఎక్కువే అయిన‌ట్టు తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా పైసా వ‌సూల్‌కు రూ. 46 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ పెట్టార‌ట నిర్మాత‌లు.

ఇప్పటికే శాటిటైట్ అన్నీ కలుపుకుని 8కోట్ల వరకు వచ్చేసింది. డిజిటల్ రైట్స్, అదర్ లాంగ్వేజెస్, థియేటర్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఎలా చూసుకున్నా సినిమా రిలీజ్‌కు ముందే మంచి లాభాలు రావడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఈ నెల 28న టీజ‌ర్‌, ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న సినిమా రిలీజ్ చేయ‌నున్నారు.