ప్ర‌భాస్ – మ‌హేష్ వార్ వెన‌క కార‌ణం ఇదే

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వ‌ర‌కు ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఎక్కువ థియేట‌ర్ల‌లో సోలోగా రిలీజ్ అవుతూ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ కొల్ల‌గొట్టేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో టాలెంట్ ఉంటేనే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నాడు. దీంతో ఇప్పుడు ఒకేసారి పండ‌గ‌ల సీజన్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చినా అన్నీ హిట్ అవుతున్నాయి.

గ‌త రెండు సంక్రాంతి సీజ‌న్ల‌లోనే ఇదే జ‌రిగింది. ఇక ద‌స‌రాకు కూడా మూడు సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాల్లో స‌త్తా ఉన్న జై ల‌వ‌కుశ‌, మ‌హానుభావుడు హిట్ అయితే స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే ఈ సారి వ‌చ్చే సంక్రాంతితో పాటు స‌మ్మ‌ర్‌కు కూడా బిగ్ వార్ జ‌ర‌గ‌నుంది. 2018 స‌మ్మ‌ర్‌కు బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్ ఇద్ద‌రూ త‌మ సినిమాల‌తో పోటీ ప‌డుతున్నారు.

వీరిద్ద‌రు ఒకేసారి పోటీప‌డితే స‌మ్మ‌ర్‌కు బాక్సాఫీస్ వార్ హీటెక్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌హేష్‌బాబు – కొర‌టాల శివ కాంబోలో వ‌స్తోన్న భ‌ర‌త్ అను నేను స‌మ్మ‌ర్‌లో రిలీజ్ అవుతోంది. స్పైడ‌ర్ ప్లాప్ అవ్వడంతో స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ కొట్టాల‌ని మ‌హేష్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇక వీరి కాంబోలో వ‌చ్చిన శ్రీమంతుడు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇక స‌మ్మ‌ర్‌లోనే బాహుబ‌లి సినిమాల‌తో నేష‌న‌ల్ స్టార్ అయిన ప్ర‌భాస్ సాహో సినిమాతో వ‌స్తున్నాడు. రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాల‌తోనే బాక్సాఫీస్ వార్ హీటెక్కుతుంద‌నుకుంటే స‌మ్మ‌ర్ హిట్ట‌ర్‌గా పేరున్న బ‌న్నీ కూడా త‌న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియాతో దిగుతున్నాడు. మ‌రి ఈ ట్ర‌యాంగిల్ వార్‌లో ఎవ‌రు ఎవ‌రిపై చేయి సాధిస్తారో ? చూడాలి.